
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -728 లో...... జ్యోత్స్నతో సూరజ్ మాట్లాడతాడు. నిన్ను మీ తాత ఇంత గొప్పగా ఎప్పుడైనా చూసాడా.. దానికి కారణం నేనే అని సూరజ్ చెప్తాడు. ఐ లవ్ యు బంగారం అని జ్యోత్స్నకి సూరజ్ ఫ్లవర్ ఇస్తాడు. అది జ్యోత్స్న తీసుకొని కాలి కింద వేసి నలిపేస్తుంది. నాకు ఎడమ కాలి బొటన వేలు కింద ఎలా నలిగిపోయిందో చూడమని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న వెళ్ళాక ఆ గులాబీ రేకులని ఏరుకుంటాడు సూరజ్. ఆ తర్వాత పోటీలో గెలిచినందుకు ఇంట్లో శివన్నారాయణ చిన్నగా పార్టీ ఏర్పాటు చేస్తాడు. కేక్ కట్ చేసి అందరికి తినిపిస్తాడు.
ఆ తర్వాత ప్రతీ మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందని శివన్నారాయణ అనగానే శివన్నారాయణ వెనకాలకి పారిజాతం వెళ్లి నిల్చొని ఉంటుంది. ఏంటి పారు అక్కడికి వెళ్ళావని కార్తీక్ అడుగుతాడు. మీ తాత ఏదో అంటున్నాడు కదా ప్రాక్టికల్ గా చూపిస్తున్నానని పారు అనగానే నేను చెప్పేది నీ గురించి కాదు దీప గురించి అని శివన్నారాయణ గొప్పగా చెప్తాడు. మరొకవైపు పోటీలో ఓడిపోయినందుకు మాలిని కోపంగా ఉంటుంది. అప్పుడే దక్షిణామూర్తి వస్తాడు. నేను ఓడిపోయాను అమ్మ అను అంటాడు. లేదు మావయ్య మీరు గెలిచారు. మీ కూతురిని మీ పక్కన కూర్చొపెట్టాను మీ కూతురు గెలిచిందని చెప్తుంది. ఆ కుటుంబం వల్ల నువ్వు ఎంత నష్టపోయావో నాకు తెలుసు అమ్మ అని దక్షిణామూర్తి అంటాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకు మావయ్య త్వరలోనే ఇరుకుటుంబాలు కలుస్తాయని మాలిని అంటుంది. గెలిచింది బెటరేలే బాబాయ్.. బలాలు ఏంటో తెలిసాయని మాలిని కన్నింగ్ గా ఆలోచిస్తుంది.
మరొకవైపు జ్యోత్స్న పైకి వెళ్తుంటే అక్కడ పూలకుండి తగిలి పడిపోతుంది. కాలి వేలికి రక్తం వస్తుంది. దాంతో సూరజ్ తన కర్చీఫ్ తీసి కడతాడు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. చూసుకోవాలి కదా మేడమ్ మీ ఎడమ కాలి బొటన వేలుకి తగిలిందని సూరజ్ అనగానే రోజ్ ఫ్లవర్ ని తొక్కినప్పుడు జ్యోత్స్న అన్నది గుర్తుచేసుకుంటుంది జ్యోత్స్నని సుమిత్ర లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత కార్తీక్ దీప మాట్లాడుకుంటారు. జ్యోత్స్నని సూరజ్ ఇష్టపడుతున్నాడని దీప అంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. ఆ పూలకుండిని వాడే అటువైపు పెట్టాడని పారిజాతం అనగానే కార్తీక్ , దీప షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

