Home

»

Tv News

డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద రచ్చ.. దీపను కూతురిలా అక్కున చేర్చుకున్న సుమిత్ర!

May 24, 2026 9:22AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -678 లో......అందరం భోజనం చేద్దాం పదండి అని శివన్నారాయణ అనగానే దీప, బావ మనతో భోజనం చెయ్యడం నాకు ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది. ఎందుకే మమ్మల్ని ఇంకా పని వాళ్ళలాగే చూస్తున్నావా అని కాంచన అంటుంది. ఇది నా తాత ఇల్లు నాకు నచ్చిన దగ్గర భోజనం చేస్తానని కార్తీక్ అంటాడు. అవును నువ్వు నా కొడుకు కూతురివి.. కార్తీక్ నాకు కూతురి కొడుకు.. నాకు ఇద్దరు సమానమే ఏదైనా ఉంటే మీరు ఆఫీస్ లో చూసుకోండి అని జ్యోత్స్నతో శివన్నారాయణ కోప్పడతాడు.

 

ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. శౌర్య తనకి రసం కావాలని అంటుంది. ఇంట్లో చాలీచాలని కూరలతో తింటారు కదా అని జ్యోత్స్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంది. తనకి కార్తీక్ మంచి కౌంటర్ ఇస్తాడు. మరొకవైపు కాశీ రెడీ అవుతుంటే స్వప్న వెనకాల నుంచి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. మరొకవైపు జ్యోత్స్న భోజనం చేసి కోపంగా అక్కడ నుంచి వస్తుంటే దీప తన వెనకాలే వచ్చి ఏంటి బుజ్జమ్మ అని జ్యోత్స్న బుగ్గగిల్లుతుంది దీప. ఏంటి ఇంత గట్టిగా గిల్లావని జ్యోత్స్న అంటుంది. నీలాగా సుకుమారంగా పెరగలేదు కదా అందుకే నా చేతులు ఇలా ఉంటాయని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇక దీప, కార్తీక్ ఇద్దరు కలిసి జ్యోత్స్నని ఒక ఆట ఆడుకుంటారు. ఇద్దరు ఒకేసారి జ్యోత్స్న చెంపగిల్లుతారు.

 

ఆ తర్వాత శివన్నారాయణ, కార్తీక్, దశరథ్ ఒక గదిలో పడుకుంటారు. సుమిత్ర గదిలో దీప పడుకుంటుంది. నేలపైన చాప వేస్తుంది. కింద ఎందుకు పైన పడుకోమని సుమిత్ర అంటుంది. శౌర్య, సుమిత్ర ఒళ్ళో పడుకుంటుంది. నువ్వు కూడా నా ఒళ్ళో పడుకో దీప.. నీకు అమ్మ అనుకోని పడుకోమని సుమిత్ర అనగానే దీప ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com