Home

»

Tv News

గూడు చెదిరిన పక్షుల్లా నా పిల్లలు వెళ్ళిపోతారా? ఎమోషనల్ అయిన రామరాజు!

May 24, 2026 9:00AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-479 లో.. సుకన్య చేసిన పనికి భాగ్యం తనని కొడుతుంది. ఎందుకలా కొడుతున్నావని సుకన్య అడుగగా ఆ నర్మద వాళ్ళని బయటకి పంపించడానికి నేను ప్లాన్ చేస్తే నువ్వేమో వాళ్ళని ఇదే ఉండేలా ప్లాన్ చేస్తావా అని భాగ్యం తిట్టగానే తనని వల్లి ఆపుతుంది. ఇక తర్వాత ప్లాన్ చెప్తుంది. ఇకనుండి ఆ నర్మదకి కంట్లో నుండి నీళ్ళు తప్పా.. నోట్లో నుండి మాట బయటకు రాదని వల్లి అనగానే భాగ్యం, ఆనందరావు, సుకన్య హ్యాపీగా ఫీల్ అవుతారు. రామరాజు ఒంటరిగా కూర్చొని కుటుంబం గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే అక్కడికి వేదవతి వస్తుంది. ఎందుకండి ఇలా బాధపడుతున్నారని అడుగుతుంది. ‌అందరు కలిసి ఉండాలని అనుకున్నా కానీ ఇలా జరుగుతుందని రామరాజు అంటాడు. ఏం కాదులేండి అన వేదవతి అనగానే ఇందాక మీ అక్కయ్య , అన్నయ్య మీ కొడుకులే నీకు శత్రువులు అని‌ అన్నారు.. గూడు చెదిరిపోగానే పక్షులన్నీ ఎగిరిపోయినట్టు నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోతానని అన్నారు.. నా బతుకే కాదు నా చావు కూడా అనాధగా ముగిసిపోతుందని అన్నారు. ఆ మాట ఎక్కడ నిజమవుతుందోనని భయంగా ఉందని రామరాజు అంటుంటే అలా మాట్లాడకండి అంటూ వేదవతి ఎమోషనల్ అవుతుంది.

 

ధీరజ్, ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటారు . ఈ ఇల్లుకి ఏదో మబ్బు కమ్మేసినట్టుంది. అందుకే ఈ గొడవలు అని ప్రేమ బాధపడుతుంది. అవన్నీ తొలగిపోయి ఈ ఇంట్లో అందరు సంతోషంగా ఉండేలా చేస్తానని ధీరజ్ అంటాడు. మరోవైపు సాగర్.. అది జరగదని అంటాడు. పిచ్చోడిలా మాట్లాడకు సాగర్, నువ్వు తాళి కట్టావ్ కాబట్టి సరిపోయింది లేదంటే నీ చెంపపగులగొట్టేవాడిని అని నర్మద అనగానే సాగర్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావని సాగర్ అనగానే ఎంతసేపు వెళ్ళిపోవాలనే ఆలోచిస్తున్నావ్ కానీ వెళ్ళాక ఎలా ఉంటావ్.. అయిన వాళ్ళు లేకుండా ఎలా సంతోషంగా బ్రతుకుతావ్.. బయటకు వెళ్ళాక మళ్ళీ తిరిగి రాగలవా అని నర్మద అనగానే అదే వద్దు అని అంటున్నా.. అమూల్య పెళ్ళి తర్వాత మనం వెళ్ళిపోదామని సాగర్ అనేసి వెళ్ళిపోతాడు.  మరోవైపు రామరాజు బాధపడుతుంటాడు. అమూల్యని కాలేజీలో విశ్వ అవమానిస్తాడు. అది తల్చుకొని అమూల్య కంగారుపడుతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఆ విశ్వ గాడిని చంపేస్తారని అమూల్య అనుకుంటుంది. అదే సమయంలో విశ్వ హ్యాపీగా మందు కొడుతూ అమూల్య గురించి ఆలోచిస్తాడు.

 

మరుసటి రోజు నర్మద, వేదవతి ఇద్దరు గీతకి చెరోవైపు ఉండి మాట్లాడుకుంటారు. ఓయ్ గవర్నమెంట్ కోడలా ఏంటి ఇది అని అడుగుతుంది వేదవతి. గీత అని నర్మద అనగానే ఆల్రెడీ మండుతుంది. ‌ఇంకా పెట్రోల్ పోయకు అని వేదవతి అనగానే నాకు కూడా అలాగే ఉంది అని నర్మద అంటుంది. ఏంటి వాడు అలా చేస్తున్నాడని వేదవతి అనగానే నా భర్త కంటే ముందు నీ కొడుకు అని నర్మద అంటుంది. ఇక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే అప్పుడే ధీరజ్ వచ్చి ఆపుతాడు. ప్రేమ వచ్చి నర్మదని హగ్ చేసుకొని ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుకుంటారు. అది చూసిన శ్రీవల్లి, సుకన్య ఓర్బలేకపోతారు. ఇక వల్లి వచ్చి.. ప్రేమ నువ్వేం చేస్తున్నావ్ గీత ఎందుకు దాటావని అంటుంది. మామయ్యని మళ్ళీ మాటలు అనిపించడానికే ఇలా చేస్తున్నావా అని వల్లి అనేటప్పడే రామరాజు వస్తాడు. ఇంకోసారి ఇలా చేయకమ్మా అని ప్రేమతో అనేసి రామరాజు వెళ్తాడు. ఇక సుకన్య, వల్లి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. అది చూసిన నర్మద.. మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ గా ఉందని, అదే కన్ఫమ్ అయితే మీకు మాములుగా ఉండదని అంటుంది. దాంతో ఇద్దరు టెన్షన్ పడతారు. వల్లి వదిన జాగ్రత్త.. నర్మద వదిన ఎంత మంచిదో అంత గయ్యాలీ.. తేడా వస్తే తాట తీస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో అదేం లేదని వల్లి, సుకన్య అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com