Home

»

Tv News

 కూతురు బాక్సింగ్ ఛాంపియన్ అయితేనే క్షమిస్తానన్న విశ్వ.. శకుంతల, పెద్దసారు మధ్య గొడవ!

May 24, 2026 10:59AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 277లో.. విశ్వ ఇంటికి వీరు, రుద్ర, గంగ, రంగ, పెద్దసారు వెళ్తారు. ‌సుధాకి ఆవకాయ పచ్చడి ఇచ్చి బయటకు వస్తుంటే బయట కార్ లో ఉన్న శకుంతల చూస్తుంది. ఇంటికి పోనియ్ సూర్య అని కోపంగా శకుంతల అంటుంది. ఇక ఇంటికి వెళ్ళి సీరియస్ గా కూర్చుంటుంది శకుంతల. ఇక మరోవైపు విశ్వని కార్ లో పైడిరాజు తీసుకెళ్తుంటాడు. కార్ ఆపమని విశ్వ అంటాడు. నాకు ఎందుకు అబద్ధం చెప్పావ్ అని విశ్వ అడుగుతాడు. అదేంటి సర్ అని పైడిరాజు అడుగగా నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నీ డ్రైవింగ్ లైసెన్స్ ని చూసాను కానీ నువ్వు ఎక్స్పైరీ అయిపోయిందని అబద్ధం చెప్పావ్ అంటే నాకు నచ్చని వ్యక్తులు ఎవరో నా ఇంటికి వచ్చారు ఎవరని పైడిరాజుపై విశ్వ ఫైర్ అవుతాడు‌. గంగ, రుద్ర సర్ అని పైడిరాజు అంటాడు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావ్.. వాళ్ళిద్దరూ వస్తే నేను ఏం అనను అని నీకు తెలుసు.. చెప్పు ఎవరొచ్చారని గట్టిగా అడిగేసరికి సుధా వాళ్ళ అన్నయ్య గారు వచ్చారని పైడిరాజు చెప్పగానే విశ్వ షాక్ అవుతాడు.

నేను లేను సమయం చూసి కలుసుకుంటున్నారా అని విశ్వ అనగానే ఎంతైనా వాళ్ళిద్దరూ అన్నాచెల్లెల్లు కదా.. ఆ రక్తసంబంధం వచ్చేంతవరకు ఉంటుందని పైడిరాజు అంటాడు. నీకు వాళ్ళ గురించి తెలియదు.. నా ప్రేమని అవమానించారు.. నన్ను తక్కువ చేసి మాట్లాడారు.. నేనెందుకు పనికి రాను అన్నట్టుగా మాట్లారు అంటూ తన గతాన్ని చెప్తాడు విశ్వ.  ఇక లాభం లేదు.. వైజాగ్ నుండి వెళ్ళిపోవాలని విశ్వ అంటాడు. మీ కూతురు దొరికితే సంతోషంగా ఉంటారా అని పైడిరాజు అనగానే ఉండను .. వాళ్ళకి ఇంకా దూరం చేస్తానని విశ్వ అంటాడు. అదే మీ కూతురు మీలాగే బాక్సింగ్ ఛాంపియన్ అవుతే ఏం చేస్తారని పైడిరాజు అంటాడు. అప్పుడు నేను వెళ్ళి క్షమించమని అడిగి, సుధాని తనని కలుపుతానని విశ్వ అంటాడు. అయితే ధీరజ్ మీద గంగ గెలిస్తేనే అలా చేస్తానని పైడిరాజుతో విశ్వ అంటాడు.

మరోవైపు గంగ, రంగా, రుద్ర, వీరు, పెద్దసారు బయట వెయిట్ చేస్తుంటారు. మీ అత్తయ్య ఫుల్ ఫైర్ లో ఉంది వీరు.. ఫస్ట్ మీరంతా వెళ్ళండి.. నేను తర్వాత వస్తానని పెద్దసారు అనగానే మీరు తప్పించుకుంటారా అని రంగా అంటాడు. మాకు తిట్లు పడతాయి కదా పెద్దోరు అని గంగ అనగానే సరే అయితే ఫస్ట్ రుద్ర, గంగ వెళ్తారు. తర్వాత వీరు వెళ్తాడు.. తర్వాత నేను వస్తానని పెద్దసారు అనగానే మొదటగా గంగ,రుద్ర లోపలికి వచ్చి.. అమ్మగారు నేను అమ్మనాన్నలని చూడటానికి వెళ్ళానని గంగ అంటుంది. నేను గంగని తీసుకుని రావడానికి వెళ్ళానని రుద్ర అంటాడు. మిమ్మల్ని నేనేం అడుగలేదు.. అడుగను.. నా వాళ్ళని మాత్రమే అడుగుతాను. నా భర్తని మాత్రమే అడుగుతానని శకుంతల అంటుంది. ఇక తర్వాత పెద్దసారు వస్తాడు. ఏంటి మీరంతా ఇక్కడున్నారు.. ఎవరికి ఏం పనులు లేవా.. వెళ్ళండి వెళ్ళండి ఎవరి పనులు వారు చూస్కోండి అని పెద్దసారు అనగానే ఆగండి అందరు.. మీ నాటకం బయట పడుతుందని అందరిని పంపిస్తున్నారా అని శకుంతల అంటుంది.  నాటకమేంటి అని పెద్దసారు అనగానే మీరు సుధా దగ్గరకి ఎందుకు వెళ్ళారని శకుంతల అడుగుతుంది. ఈ ఇంట్లో మొదటిసారి ఆవకాయ పచ్చడి పెట్టాం కదా.. ఆడపడుచుకి ఇస్తే ఇంటికి మంచిది అని సుధాకి ఇవ్వాడానికి వెళ్ళానని పెద్దసారు చెప్తాడు. అంటే నా మాట కాదని వెళ్ళారు.. మీరంతా నన్ను మోసం చేసి సుధా దగ్గరికి వెళ్ళారు.. మీరంతా నా కుటుంబం అనుకున్నాను కానీ నా తమ్ముడి చావుకి కారణం అయిన దాని దగ్గరికి వెళ్ళారు. అది చస్తే బాగుండు అని శకుంతల అంటుంది. శకుంతలా.. మాటలు జాగ్రత్త.. తను ఈ ఇంటి ఆడపడుచు.. ఎంత కోపం ఉన్నా ఒకరి చావు కోరుకోకూడదని పెద్దసారు ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com