Home

»

Tv News

Karthika Deepam 2: జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చిన సూరజ్.. డబ్బు వద్దంటూ ఊహించని కండీషన్!

May 30, 2026 10:58AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -683 లో.....సూరజ్ స్టాల్ ని జ్యోత్స్న అన్యాయంగా కూల్చేసినందుకు గాను అతను శివన్నారాయణ దగ్గరికి వచ్చి నష్టపరిహారం అడుగుతాడు. జ్యోత్స్న కావాలనే ఇదంతా చేసింది అనడానికి సూరజ్ సాక్ష్యంగా వీడియో చూపిస్తాడు. సూరజ్ చెప్పేది నిజమేనని కార్తీక్ కూడా చెప్తాడు. నాకు ఏ రకంగా నష్టపరిహారం చేస్తారో మీకే వదిలేస్తున్నానని సూరజ్ అంటాడు. సరే బ్రో మీరు చెప్పారు కదా మేం ఆలోచించుకొని పిలుస్తామని కార్తీక్ అంటాడు. దాంతో అక్కడ నుంచి సూరజ్ వెళ్తాడు. వాడు ఏదో వాగుతున్నాడని నిజం అనుకోకండి అని చెప్పి జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్తుంది.

ఆ తర్వాత జ్యోత్స్న వెనకాలే పారిజాతం వెళ్తుంది. నువ్వు చేసింది తప్పేనే.. ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటావా కార్తీక్ కాకపోతే వైరా, వైరా కాకపోతే ఇప్పుడు కొత్తగా ఇతనితోనా అని జ్యోత్స్నపై పారిజాతం కోప్పడుతుంది. అప్పుడే జ్యోత్స్నని శివన్నారాయణ పిలుస్తాడు. 

అసలు నీకు ఆ ఫుట్ పాత్ వెండర్ కి గొడవ ఏంటని అక్కడే ఉన్న దశరథ్ అడుగుతాడు. దాంతో సూరజ్ తో గిఫ్ట్ షాప్ లో జ్యోత్స్నకి జరిగిన దాని గురించి చెప్పి రివెంజ్ కోసం తనని రాంగ్ ప్లేస్ లో దింపానని చెప్తుంది. అది మనసులో పెట్టుకొని ఇదంతా చేసాడని కార్తీక్ అందరికి చెప్తాడు. ఇందులో మొత్తం చూస్తే జ్యోత్స్నదే తప్పు.. నీకు నచ్చితే ఏదైనా ఇచ్చేయాలా అని జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది. తప్పు మనవైపు ఉంది కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఆ అబ్బాయిని పిలిపించమని కార్తీక్ తో శివన్నారాయణ చెప్తాడు.

జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్లి.. నీకు టైమ్ దగ్గర పడింది. ఆ సూరజ్ కాళ్లపై పడి క్షమాపణ అడుగమని దీప అనగానే అది జరగని పని అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత సూరజ్ వస్తాడు. అతనికి ఐదు లక్షలు ఇచ్చి తీసుకోమని శివన్నారాయణ చెప్తాడు. చాలదని సూరజ్ అంటాడు. చూసారా అతను డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. ఇంకొక ఐదు లక్షలు తీసుకొనిరా అని పారిజాతంతో శివన్నారాయణ అంటాడు. అవి చాలవని సూరజ్ అంటాడు. నాకు కావల్సింది డబ్బు కాదు పోయిన మర్యాద, గౌరవం అని సూరజ్ అంటాడు. 

ఇప్పుడు నన్ను సారీ చెప్పమంటున్నావ్ అంతే కదా అని జ్యోత్స్న అంటుంది. ఇంకా నయం మా అమ్మాయి సారీ చెప్తున్నట్లు ఫ్లెక్సీ వేయించమంటలేవు.. అయిన పది లక్షలు వద్దన్నావ్.. ఈ బోడి ఫ్లెక్స్ కి ఒప్పుకుంటావా అని పారిజాతం అంటుంది. ఇదేదో బాగుంది.. మా స్టాల్ ముందు ఒక సారీ చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టండి అని సూరజ్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. మీ నష్టపరిహారం నీకు జరుగుతుందని చెప్పి సూరజ్ ని శివన్నారాయణ పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com