
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -484 లో.. ప్రేమ బట్టలు ఉతికేస్తుంటే ధీరజ్ వచ్చి హెల్ప్ చేస్తానని అంటాడు. ఆ వంకతో ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకుంటాడు. ఏంట్రా నువ్వు చేస్తుందని ప్రేమ అంటుంది. అప్పుడే నర్మద బట్టలు సాగర్ కి ఇచ్చి పిండమని చెప్తుంది. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ ని బట్టలు ఉతకడం ఏంటని సాగర్ అంటాడు. ఇప్పుడు నేను రెడీ అయి ఆఫీస్ కి వెళ్ళాలి.. లేట్ అవుతుంది.. ఇద్దరం కలిసి పనిచేసుకుంటేనే కదా బాగుంటుంది.. మరి జాబ్ మానేయాలా అని నర్మద అంటుంది.
ఇక ఏం చేయలేక సాగర్ బట్టలు తీసుకొని వెళ్లి ఉతుకుతాడు. అక్కడే ఉన్న ప్రేమ, ధీరజ్ చూసి నవ్వుకుంటారు. ఎంత కష్టం వచ్చింది అన్నయ్య అంటూ ధీరజ్ అంటాడు. నన్ను చూస్తే మీకు వెటకారంగా ఉందా అని సాగర్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. మీ అన్నయ్యకి పనులు చేతకాదు గానీ పౌరుషానికి ఏం తక్కువ లేదని ధీరజ్ , ప్రేమ వాళ్ళతో నర్మద అంటుంది. ఈ పనులన్నీ చెయ్యలేక మళ్ళీ కలిసిపోతాడులే వదిన అని ధీరజ్ అంటాడు.
ఆ తర్వాత సాగర్ వెళ్లి ప్రసాదరావు ఇంట్లో భోజనం చేస్తుంటాడు. ఇక నర్మద వెళ్లి ఇది ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావ్.. దీనంతటికి కారణం నువ్వేనా నాన్న అని ప్రసాదరావుని నర్మద తిడుతుంది. మీరు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆ ఇంట్లో నుంచి మీ వాటా తీసుకొని బయటకు వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను.. అది నీకు ఎందుకు అర్థం అవ్వడం లేదని అతను అంటాడు. దాంతో ప్రసాదరావుని నర్మద కోప్పడుతుంటే.. సాగర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మా మావయ్య గారు కుటుంబం ముక్కలు అవొద్దని చూస్తున్నాడు.. నువ్వేమో ఇలా ఆలోచిస్తున్నావని వాళ్ళ నాన్నపై నర్మద కోప్పడుతుంది.
ట్యాబ్లెట్ వేసుకుంటున్నట్లు ఇంట్లో వాళ్ళని నమ్మించాలంటే ట్యాబ్లెట్ ని తీసుకొని ఇలా ఎవరు చూడక ముందు బయటకు పారెయ్యాలని వల్లికి సుకన్య చెప్తుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. చేతిలో ఏంటని సుకన్యని అడుగుతుంది. ఏం లేదని వల్లి అంటుంది. ప్రేమ చూడకముందు సుకన్య చేతిలోని ట్యాబ్లెట్ సుకన్య నోట్లో వేస్తుంది. ఏంటి నోట్లో అని ప్రేమ అడుగుతుంది. వల్లి ఏదో ఒకటి కవర్ చేసి ప్రేమని పంపిస్తుంది. నీ కడుపు నా చావుకి వచ్చిందని సుకన్య అంటుంది.
ఆ తర్వాత భాగ్యం దగ్గరికి ధీరజ్, ప్రేమ, నర్మద వెళ్లి.. నీకు అసలు బుద్ది ఉందా ఎందుకు ఇలా మరొకకుట్ర చేసావని నర్మద వాళ్ళు భాగ్యాన్ని తిడుతారు. అసలు మీకు ఏం తెలిసింది క్లారిటీతో తిట్టండి అని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






