
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1045 లో.. నీ ప్రాబ్లమ్ క్లియర్ అయిందా అని రాజుని ఇందు అడుగుతుంది. ఏదో సాల్వ్ అయిందని రాజు చెప్తాడు. అంత అర్జెంట్ గా డబ్బు ఎందుకని ఇందు అడుగుతుంది. ఏంటి సొంత పెళ్ళాం అడిగినట్లు అడుగుతున్నావని రాజు కోప్పడుతాడు. ఏమైంది బాబు అని అపర్ణ వస్తుంది. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నామని రాజు కవర్ చేస్తాడు.
అవును ఇందు నీ మెడలో చైన్ ఏమైందని అపర్ణ అడుగుతుంది. ఇందు తడబడుతూ అది గదిలో ఉన్నట్లుందని అంటుంది. నువ్వు అది మీ అమ్మ జ్ఞాపకం అనుకుంటావ్ అలాంటది.. దాన్ని ఒక్క క్షణం కూడా వదలవు.. ఏమైందని అపర్ణ అడుగుతుంది. అది గదిలోనే ఉంది వేసుకుంటానని ఇందు లోపలికి వెళ్తుంది.
అది వాళ్ళ అమ్మ జ్ఞాపకం బాబు.. ఆ చైన్ వెంటుంటే తనకి దైర్యంగా ఉంటుంది.. ఏమైందో కనుక్కో బాబు అని రాజుతో అపర్ణ చెప్తుంది. ఇందుకి ఆ చైన్ సెంటిమెంటా.. ఎలాగైనా చైన్ తీసుకొని వచ్చి తనకి ఇవ్వాలని రాజు అనుకుంటాడు.
మరొకవైపు మా అమ్మ గురించి చెప్పు అని ఆంటోనిని లక్కీ అడుగుతాడు. ఆంటోనీ ఫుల్ గా డ్రింక్ చేసి పడుకుంటాడు. అప్పుడే లక్కీకి రాజు ఫోన్ చేసి అర్జెంట్ గా కలవాలి.. బైక్ తీసుకొని రా అంటాడు.
మరొకవైపు ఐశ్వర్య ఫ్రెండ్ రాజేష్ డబ్బు కోసం తనకి ఫోన్ చేసి గొడవపడతాడు. మొన్న మీ అక్క ఇందు డబ్బు ఇస్తానని నన్ను పంపింది.. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వమని ఐశ్వర్యతో రాజేష్ అంటాడు. ఇందుకి ఐశ్వర్య ఫోన్ ఇస్తుంది. ఇందు అతన్ని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు అని ఐశ్వర్యతో ఇందు అంటుంటే నువ్వు యాక్టింగ్ చెయ్యకని ఐశ్వర్య అంటుంది.
ఆ తర్వాత నాకు అవసరం ఉండి ఇందుని డబ్బు అడిగాను.. తన చైన్ ఇచ్చింది.. తాకట్టు పెట్టాను.. ఇప్పుడు తనకి సెంటిమెంట్ అని తెలిసింది.. ఈ బైక్ తాకట్టు పెట్టి చైన్ విడిపించలని లక్కీతో రాజు అంటాడు. నువ్వు ఏంట్రా మంచివాడిలాగా మారిపోయావని రాజుతో లక్కీ అంటాడు.
ఆ తర్వాత ఇందు దగ్గరికి రాజు వచ్చి ఒక సర్ ప్రైజ్ అంటూ తన చైన్ తనకి ఇస్తాడు. దాంతో ఇందు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది నీకు సెంటిమెంట్ కదా అందుకే తీసుకొని వచ్చానని రాజు చెప్పగానే అబ్బో తమరికి మంచి మనసు కూడా ఉందన్న మాట అని ఇందు అంటుంది.
మరొకవైపు వెంకీ ఇంటికి వెళ్లి జాబ్ రాలేదని చెప్తాడు. దాంతో చలపతి లక్ష్మి డిస్సపాయింట్ అవుతారు. తరువాయి భాగంలో అపర్ణ పంతులిని పిలిచి రాజు, ఇందుకి శోభనం ముహూర్తం పెట్టిస్తుంది. అది తెలిసి రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






