Home

»

Tv News

Karthika Deepam 2: వీలునామా మార్చేసిన దశరథ్.. జ్యోత్స్నకు ఊహించని షాక్!

Mar 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -628 లో... సుమిత్ర దగ్గరికి కాంచన, శ్రీధర్ వస్తారు. మన ఇద్దరి కోరికలు బలంగా ఉన్నాయి. నేను క్షేమంగా ఉన్నాను.. అలాగే దీప కడుపులో బిడ్డ కూడా క్షేమంగా ఉందని సుమిత్ర అంటుంది. 

ఆ తర్వాత దశరథ్ దగ్గరికి దీప, కార్తీక్ వస్తారు. జ్యోత్స్న అలాంటిదని తెలిసినా కూడా నీకు కోపం రావడం లేదా మావయ్య అని దశరథ్ ని కార్తీక్ అడుగుతాడు. పెంచిన ప్రేమ గొప్పదా, కన్నా ప్రేమ గొప్పదా అంటే ఏం చెప్తావ్ రా అని దశరథ్ అడుగుతాడు. పెంచిన ప్రేమ గొప్పదని కార్తీక్ అంటాడు. ఎందుకంటే శౌర్య నేను పెంచిన కూతురు. తనకి ఆపరేషన్ చెయ్యాలసి వచ్చినప్పుడు ఎంత కష్టం అయినా చేయించాను. కానీ నా కూతురిని అత్త కోసం త్యాగం చెయ్యడానికి సిద్దపడ్డానని కార్తీక్ చెప్తాడు.

ఈ విషయంలో మనం ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు జ్యోత్స్న విషయంలో నేను కూడా అంతే జ్యోత్స్నని పెంచాను కానీ పద్ధతిగా పెంచలేదని దశరథ్ అంటాడు. 

జ్యోత్స్నకి పెళ్లి చెయ్యండి మావయ్య అంతా సెట్ అవుతుంది. తను ఇప్పటికీ మీ కూతురని అనుకుంటుంది .. ఒకసారి కాదని తెలిసిందో ఇక తన రియాలిటి బయటకు వస్తుందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకి పెళ్లి చేస్తేనే అంతా హ్యాపీగా ఉంటుందని కార్తీక్ చెప్తాడు.

ఆ తర్వాత  సుమిత్ర దగ్గరికి దశరథ్ వెళ్తాడు. జ్యోత్స్నకి పెళ్లి చెయ్యాలి కదా.. అయితే నేను చేసేది చేస్తాను.. నువ్వు అడ్డుపడకని దశరథ్ చెప్తాడు. దశరథ్ ఏం చెయ్యబోతున్నాడో కార్తీక్, దీపలకి అర్థం కాదు.

ఆ తర్వాత లాయర్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు దశరథ్. లాయర్ వచ్చాక దశరథ్ ఎందుకు పిలిపించాడో చెప్తాడు. వీలునామా మర్చి రాయించానని అనగానే అందరు షాక్ అవుతారు. వీలునామా చదవమని చెప్పగా లాయర్ చదువుతాడు. నా ఆస్తులన్నీ నా కూతురికి చెందుతాయి. నా కూతురు పన్నెండు నెలల్లోపు పెళ్లి అయి పిల్లలని కంటే తన పిల్లలకి ఆస్తులు దక్కుతాయి లేదంటే నా మేనల్లుడికి చెందుతాయని ఉంటుంది. 

అది విని శివన్నారాయణ, జ్యోత్స్న ఇద్దరు దశరథ్ పై కోప్పడుతారు. పన్నెండు నెలలల్లో జ్యోత్స్నకి పెళ్లి అయి పిల్లలు పుడతారని గ్యారెంటీ ఏంటని పారిజాతం అంటుంది. అసలు ఎందుకిలా రాయించావని జ్యోత్స్న అడుగుతుంది. నా కూతురు నువ్వే కదా అందుకే నా కూతురికి పుట్టే పిల్లలకి ఆస్తులు అని రాసాను.. నువ్వు నా కూతురు కాదంటే చెప్పమని జ్యోత్స్నని దశరథ్ అనగానే తను టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com