
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -990 లో... రాజు, లక్కీ ఇద్దరికి తమ కార్ లో నెక్లెస్ దొరుకుతుంది. అది చూసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది నా ఐషుది కావచ్చు తీసుకొని వెళ్లి ఇస్తే ఇంప్రెషన్ కొట్టేయొచ్చని లక్కీ అనగానే.. ఇంప్రెషన్ కొట్టేస్తే ఏమొస్తుంది.. ఇది అమ్ముకొని డబ్బు వస్తే చెరొక సగం తీసుకోవచ్చు.. నువ్వు తనకి ఒక గిఫ్ట్ ఇవ్వు అనగానే లక్కీ సరే అంటాడు.
మరొకవైపు రేఖ తన గదిలోకి వెళ్తుంది. లాకర్ తాళాలు వేలాడుతూ కనిపిస్తాయి. అదేంటి నేను తాళం వేసాను కదా అని రేఖ వెళ్లి చూసేసరికి అందులో రెండు నెక్లెస్ లు మిస్ అయి ఉంటాయి. నా నగలు తీసే ధైర్యం ఎవరికి ఉంటుందని రేఖ షాక్ అవుతుంది. హాల్లోకి వెళ్లి అడుగుతుంది.. నగలు ఎవరు తీసారని. అమ్మో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఐశ్వర్య భయపడుతుంది.భ్రమరాంబ భర్త శేషు మాత్రం తన వంకే చూస్తాడు. ఏంటి నా వైపు చూస్తున్నావని భ్రమరాంబ అనగా.. నీ చేతివాటం అదే కదా అని శేషు అనగానే మన నగలు మనం తీసుకుంటామా అని భ్రమరాంబ కవర్ చేస్తుంది.
లాకర్ లో అన్ని నగలు ఉండగా ఆ నెక్లెస్ కొట్టేయడం ఏంటని ఐశ్వర్య అనగానే ఒక్క నెక్లెస్ కాదు రెండు అనగానే ఐశ్వర్య షాక్ అవుతుంది. నేను ఒక్కటే తీసాను కదా అనుకొని... ఇప్పుడు డబ్బు అవసరం ఒక్కరికే ఉందని ఐశ్వర్య అనగానే.. కొంపదీసి నేను నెక్లెస్ తియ్యగా అది చూసిందా ఏంటి అని భ్రమరాంబ టెన్షన్ పడుతుంది. ఆ నెక్లెస్ తీసింది ఇందు తనకే అవసరం ఉందని ఐశ్వర్య అనగానే అవునని భ్రమరాంబ అంటుంది. అక్క లేదు కదా ఎలా తీస్తుందని స్వాతి అనగానే ప్లాన్ చేస్తే ఎలా అయినా తీస్తారు. అది రానివ్వు దాని సంగతి చెప్తానని రేఖ అంటుంది.
మరొకవైపు రాజు, లక్కీ దొంగ బంగారం కొనే దగ్గరకి వెళ్లి నెక్లెస్ ఇస్తారు. అతను దానికి తక్కువ అమౌంట్ ఇస్తానని అంటాడు. అప్పుడే అదే షాప్ కి రౌడీలని తీసుకొని నందు, ఇందు వస్తారు. రాజుని చూసి నువ్వు ఏంట్రా ఇక్కడ అని ఇందు అడుగుతుంది. రాజు, ఇందుకి గొడవ అవుతుంది. ఇక్కడకి ఏదో నగలు తాకట్టు పెట్టుకోవడానికి వచ్చాము.. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది దొంగ బంగారం అమ్మే షాప్ అని చెప్పి రాజు, లక్కీ నెక్లెస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత చెప్పు సేట్ వీళ్ళ దగ్గర నగలు కొన్నది నువ్వే కదా అని నందు అనగానే అమ్మవారి నగలు నేను కొనను అని సేట్ అంటాడు. అమ్మవారి నగలు అని నేను చెప్పానా.. ముందు వీళ్ళు అమ్మిన బంగారం ఇవ్వమని నందు బెదిరిస్తుంది. ఆ తర్వాత ఇందుకి స్వాతి ఫోన్ చేసి రేఖ ఆంటీ నగలుపోయాయి.. రేఖ ఆంటీ నువ్వే తీసావని అంటుందని చెప్తుంది.
ఆ తర్వాత భ్రమరాంబ నెక్లెస్ వేసుకొని చూసుకుంటుంది. అప్పుడే శేషు వస్తాడు. ఇప్పటి వరకు గొడవ జరిగింది ఈ నెక్లెస్ గురించే అని భ్రమరాంబ చెప్తుంది.. ఒకటి ఆ ఐశ్వర్య తీసింది.. ఇంకొకటి నేను తీసానని చెప్తుంది. అంటే పాపం ఇందు మీద నేట్టేసారా అని శేషు అంటాడు. ఆ రేఖకి డౌట్ రాకుండా కొన్ని రోజులు ఈ నెక్లెస్ నా దగ్గర పెట్టుకుంటానని భ్రమరాంబ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






