
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -429 లో... ఒకవైపు ప్రేమ, నర్మద మరొకవైపు వేదవతి ఇలా తనని ఆడుకుంటున్నారని వల్లి బాధపడుతుంది. అప్పుడే రామరాజు కోపంగా వల్లి అని గట్టిగా అరుస్తాడు. దాంతో వల్లి హాల్లోకి వస్తుంది.
నువ్వు ఒక్కదానివే నేను చెప్పినట్లు వింటావ్.. ఈ ఇంటికి తగ్గ కోడలు అనుకున్నాను.. నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తున్నావ్.. ఎందుకు ఇలా చేసావని వల్లిని రామరాజు నిలదీస్తాడు. తన గురించి నిజం తెలిసిపోయిందిని శ్రీవల్లి భయపడుతుంది.
అది కాదు మావయ్య గారు అని వల్లి అంటుంది. నువ్వు పని చేసే ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ కోడలు స్కూల్ కి రావడం లేదని అంటున్నాడు. పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇలా చేస్తే ఎలా అంటున్నాడని రామరాజు అనగానే మీరు అనేది దాని గురించా అని వల్లి రిలాక్స్ అవుతుంది.
ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి ఇంకా దేని గురించి అనుకున్నావని అడుగుతారు. మావయ్య గారు నేను స్కూల్ కి వెళ్ళను. ఇంట్లో అత్తయ్య గారికి హెల్ప్ చేస్తూ ఉంటానని వల్లి అంటుంది. అవసరం లేదని వేదవతి అంటుంది. అయిన వెళ్ళను మావయ్య.. అత్త మెచ్చిన కోడలుగా ఈ ఇంటి పరువు కాపాడే బాధ్యత గల కోడలిగా ఉంటాను అంతే తప్ప స్కూల్ కి పాఠాలు చెప్పడానికి వెళ్ళనని వల్లి అంటుంది.
ఎందుకు వెళ్ళవ్.. నువ్వు వెళ్లకుంటే మీ ప్రిన్సిపల్ కి వాయిస్ మెసెజ్ పెడతానని వల్లిని ప్రేమ బ్లాక్ మెయిల్ చేస్తుంది. సైగ చేస్తూ రామరాజుకి వాయిస్ రికార్డు పంపిస్తానని అనగానే వల్లి ఏం చెయ్యలేక సరే అంటుంది.
ఆ తర్వాత ప్రేమ, నర్మద వాళ్ళ ప్లాన్ బోర్డుపై గీస్తు ఆ వల్లిని ఎటు వెళ్లకుండా ఇరికించామని అనుకుంటారు. మరొకవైపు వేదవతి దగ్గరికి వల్లి వెళ్లి.. నేను వెళ్ళను అత్తయ్య అంటే తన చెంపపై ఒక్కటిస్తుంది వేదవతి. శ్రీవల్లి భయపడి అక్కడ నుండి వెళ్తుంది.
ఆ తర్వాత వల్లిని బైక్ పై చందు తీసుకొని వెళ్తాడు. చందు స్కూల్ దగ్గరికి వెళ్ళాక నేను ప్రిన్సిపల్ తో మాట్లాడుతానని అంటాడు. ఎందుకని వల్లి అడుగుతుంది. నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదా నీకు చిన్న క్లాస్ ఇవ్వడమేంటి పెద్ద క్లాస్ టీచ్ చేస్తుందని చెప్తానని చందు అంటాడు. అవసరం లేదని వల్లి అంటుంది. పోని నీ క్లాస్ వింటానని చందు అంటాడు. రైస్ మిల్ లో పనులు ఎవరు చేస్తారు వెళ్ళు అని పంపిస్తుంది శ్రీవల్లి.
ఆ తర్వాత వల్లి స్కూల్ కి వెళ్లకుండా వాళ్ళ అమ్మ భాగ్యం దగ్గరికి వెళ్తుంది. అసలేం ఏం జరిగిందో అంతా చెప్తుంది. వాళ్ళు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంతే చెప్పరని భాగ్యం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






