
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -625 లో... సుమిత్రని తీసుకొని దశరథ్ ఇంటికి వస్తాడు. సుమిత్రకి హారతి ఇచ్చి పారిజాతం లోపలికి ఆహ్వానిస్తుంది. దశరథ్ నీ గురించి హోమం చేసాడు. నీ కూతురు ఏకంగా తన ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను కాపాడుకుందని జ్యోత్స్న గురించి పారిజాతం చెప్తుంది. కాపాడుకుంది నా కూతురు దీప అని దశరథ్ మనసులో అనుకుంటాడు.
నా కూతురికి సూది అంటేనే భయం.. అలాంటిది నా కోసం ఇంత పెద్ద ఆపరేషన్ కి సిద్ధం అయిందని జ్యోత్స్నని చూసి సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత సుమిత్ర నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో.. నేను మళ్ళీ వస్తానని దశరథ్ అంటాడు. మీరు ఎక్కడికి వెళ్లొద్దని సుమిత్ర అంటుంది. త్వరగా వస్తానంటూ దశరథ్ వెళ్తాడు.
మరొకవైపు ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదు.. ఈ విషయం గురించి ఇంటికి వెళ్ళాక అత్తయ్యని ఎలా ఎదురుకోవాలో అని దీప అంటుంది. అమ్మ ఏది సాధారణంగా అనదు.. అంటే మాత్రం మాట మీదే ఉంటుంది.. నాన్న తప్పు చేసాడని తనని వదిలేసింది. ఇప్పుడు నేను తప్పు చేసానని నన్ను వదులుకుంటుంది.. ఇంటికి వెళ్ళాక అమ్మనో నిన్నో వదులుకునే పరిస్థితి వస్తుందని కార్తీక్ భయపడుతాడు.
అప్పుడే డాక్టర్ వచ్చి దీప కడుపులో బిడ్డ తనతోనే ఉందని చెప్తుంది. దాంతో దీప, కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయం దశరథ్ గారికి ముందే చెప్పానని డాక్టర్ చెప్పగానే చాలా థాంక్స్ డాక్టర్ గొప్ప రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తీక్.
మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. జ్యోత్స్న జ్యూస్ తీసుకోమని పారిజాతం అంటుంది. ఏంటి పిలుపు మారింది మనవరాలు అనే దానివి కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు మా దాస్ కూతురివి అనుకున్నాను కానీ కాదుగా సుమిత్ర కూతురివి అని పారిజాతం అంటుంది. నాకొక హెల్ప్ చేస్తావా అని జ్యోత్స్న అనగానే సరే చేస్తానని పారిజాతం అంటుంది. మా డాడీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని జ్యోత్స్న అనగానే పని మీద వెళ్ళాడని పారిజాతం అంటుంది. కాదు కాంచన అత్తయ్య ఇంటికి వెళ్ళాడని జ్యోత్స్న అంటుంది.
మరొకవైపు దీప అబార్షన్ చేయించుకుందనుకోని కాంచన ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. వాళ్ళు హాస్పిటల్ నుండి వచ్చారు.. దిష్టి తియ్యమని అనసూయకి కాంచన చెప్తుంది. అనసూయ దిష్టి తీస్తుంది. కార్తీక్, దీప మాట్లాడబోతుంటే.. అవసరం లేదు నేను వెళ్లిపోతున్నానని కాంచన అంటుంది. నేను కూడా తనతో వెళ్తున్నామని అనసూయ అంటుంది. అక్కడే శ్రీధర్ ఉంటాడు.
అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. మేము వెళ్ళేటప్పుడు నలుగురం వెళ్ళాము.. ఇప్పుడు కూడా నలుగురం వచ్చాము. దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని దశరథ్ చెప్పాగానే కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును అత్తయ్య నీకు ఇచ్చిన మాట తప్పలేదని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






