Home

»

Tv News

Brahmamudi: అపర్ణను కాపాడే ప్రయత్నంలో ఇందు.. రిచ్ అమ్మాయిల కోసం రాజు, లక్కీల వేట!

Mar 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -987 లో..... ఆస్తులన్నీ నా పేరున ఉన్నంత వరకు ఆ రేఖ నన్ను ఏం చెయ్యదు. నా బాధ అంత మిమ్మల్ని ఏదైనా చేస్తుందేమోనని అపర్ణ వాళ్ళతో ఇందు చెప్తుంది. ఇంకొక్కసారి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళనని నాకు మాటివ్వమని ఇందు చెప్తుంది. 

మరొక వైపు రాజు, లక్కీ మాట్లాడుకుంటారు. ప్లాన్ మిస్ అయిందిరా.. యాభై వేలు ఖర్చు చేస్తే అయిదు లక్షలు వస్తాయనుకున్నామని రాజు అంటాడు. ఆ తర్వాత కాసేపటికి వాళ్ళ ఫ్రెండ్ ఒకతను కార్ లో దిగుతాడు. అతన్ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. వీడు ఏంట్రా ఒక్కపూట తినడానికి కూడా ఉండేది కాదు.. ఇంత రిచ్ ఎప్పుడు అయ్యాడని రాజుతో లక్కీ అంటాడు. 

ఏంట్రా మావ లాటరీ తగిలిందా అని లక్కీ అతనితో అంటాడు. నేను ఒకప్పుడు ఛాయ్ తాగడానికి మిమ్మల్ని డబ్బు అడిగేవాడిని కానీ ఇప్పుడు అలా కాదు తిన్నది అరగడం లేదనే స్థాయికి వచ్చాని దీనికి కారణం పెళ్లి చేసుకోవడని అతను చెప్తాడు. బేబీ అంటూ తన భార్యని అతను పిలుస్తాడు. ఒక ఆంటీ కార్ లో నుండి దిగుతుంది. నువ్వు పెళ్లి చేసుకుంది ఆంటీనా అని రాజు అడుగుతాడు. ఎవరిని చేసుకున్నామని కాదు విషయం.. ఇప్పుడు నేను రిచ్ అని అతను అంటాడు. నా పెళ్లి పార్టీ అనుకోండి అని కొన్ని డబ్బులు వాళ్ళకి అతను ఇచ్చి వెళ్తాడు. రాజు, లక్కీ ఇంకా షాక్ లోనే ఉంటారు. ఆ తర్వాత వీడు వచ్చి మనకి మార్గం చూపించాడు.. మనం కూడా ఒక కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లక్కీ, రాజు అనుకుంటారు. 

మరొకవైపు ఇందుకి అపర్ణ మాటిస్తుంది. ఆ తర్వాత రాజు, లక్కీ ఇద్దరు రిచ్ అమ్మాయిలని వెతికే పనిలో పడుతారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఐశ్వర్యని చూసి ఆ ఐషుని నేను సెట్ చేసుకుంటానని లక్కీ అంటాడు. నేను వస్తానురా హాయ్ చెప్తానని రాజు అంటాడు. వద్దని లక్కీ చెప్తాడు. ఐశ్వర్య తన ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుంటుంది. అది కట్టమని అతను అడుగుతాను. కొద్ది రోజులు ఆగమని ఐశ్వర్య రిక్వెస్ట్ చేస్తుంది. 

ఐషు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాక పాపం ఐషు టెన్షన్ పడుతుంది. ఏంటో కనుక్కోవాలని లక్కీ వెళ్తాడు. హాయ్ ఐషు నన్ను గుర్తుపట్టావా.. మొన్న పబ్ లో కలిసాం.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళామని లక్కీ చెప్పగానే ఏంటి ఏదో హానీ మూన్ కి వెళ్లినట్లు చెప్తున్నావని ఐషు అంటుంది. త్వరలో వెళ్తామని లక్కీ అంటాడు. నీకు ఏదైనా హెల్ప్ కావాలా అని ఐషుని లక్కీ అడుగుతాడు. అవసరం లేదు ఈ బిల్ కట్టమని అక్కడ నుండి వెళ్తుంది. సర్లే అని లక్కీ బిల్ కడుతాడు. 

మరొకవైపు అపర్ణ మన గ్రిప్ లో ఉందో లేదో చెక్ చేద్దామని భ్రమరాంబ, రేఖ అనుకుంటారు. ఇందుని తిడుతారు. అయినా అపర్ణ సైలెంట్ గానే ఉంటుంది. దాంతో ఇద్దరు నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com