
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -612 లో.... కొన్నిరోజుల తర్వాత అన్ని సెట్ అవుతాయి. మావయ్య అసలు నిజం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పరిస్థితిని అర్థం చేసుకుంటారని దశరథ్ తో కార్తీక్ అంటాడు. నా చెల్లి నిన్ను నా కోసం కన్నదిరా అని దశరథ్ అనగానే లేదు నీ కూతురు కోసం కన్నది అని కార్తీక్ అంటాడు. ఈ టైమ్ లో కూడా నవ్విస్తావని కార్తీక్, దీపలని దశరథ్ దగ్గరికి తీసుకుంటాడు.
మరొకవైపు కావేరి ఇల్లు క్లీన్ చేస్తుంటే.. స్వప్న వచ్చి నేను క్లీన్ చేస్తానని అంటుంది. నీకు చెయ్యడం రాదని కావేరి అంటుంటే వచ్చు మా ఆయనతో కలిసి చేసేదాన్ని అని ఏదో చెప్పబోతు ఆగిపోతుంది. కావేరి పక్కకి వెళ్తుంది. స్వప్న చైర్ ఎక్కి క్లీన్ చేస్తుంటే కిందపడిపోబోతుంటే అప్పుడే కాశీ వచ్చి పట్టుకుంటాడు. అది చూసి అల్లుడు గారు కరెక్ట్ టైమ్ కి వచ్చారని కావేరి నవ్వుకుంటుంది. నన్ను ఎందుకు పట్టుకున్నావని స్వప్న అనగానే కాశీ వదిలేస్తాడు.. స్వప్న కిందపడిపోతుంది. పట్టుకొని ఒక తప్పు.. వదిలేసి మరొక తప్పు చేసావని స్వప్న అంటుంది.
మరొకవైపు దీపని హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యడానికి దీపని తీసుకొని దశరథ్, కార్తీక్ వెళ్తారు. జ్యోత్స్న నా దగ్గరికి వచ్చి ప్రెగ్నెంట్ వాళ్ళు డోనర్ గా ఉండొచ్చా అని అడిగింది. నేను డైవర్ట్ చేసాను కానీ తనకి ఇక్కడ ఏం జరుగుతుందో అంతా అర్ధం అవుతుందని డాక్టర్ చెప్తుంది.
మరొకవైపు జరిగిన సంఘటనలన్నీ జ్యోత్స్న గుర్తు చేసుకొని డాడీకి ఏదో క్లారిటీ వచ్చిందని అనుకుంటుంది. అప్పుడే దశరథ్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ డాడీ అని జ్యోత్స్న అడుగుతుంది. హాస్పిటల్ కి వెళ్ళాను.. దీపని అడ్మిట్ చెయ్యడానికి అని చెప్తాడు. అప్పుడే సుమిత్ర వస్తుంది. నీకు అమ్మ గురించి పట్టింపు లేదు కానీ ఇంట్లో పనిమనిషి గురించి పట్టించుకుంటున్నావని జ్యోత్స్న కోప్పడుతుంది. దశరథ్ ని రెచ్చగొడుతుంది. దీప పనిపనిషి కాదని దశరథ్ గట్టిగా అరుస్తాడు.
అప్పుడే శివన్నారాయణ వచ్చి ఎందుకు అలా కోపంగా అరుస్తున్నావని దశరథ్ తో అంటాడు. అబ్బా తాత కరెక్ట్ టైమ్ కి వచ్చాడని జ్యోత్స్న డిజప్పాయింట్ అవుతుంది. దీపకి ఏమైందని సుమిత్ర అడుగుతుంది. కడుపులో నొప్పిగా ఉంటే అడ్మిట్ చేశామని దశరథ్ చెప్తాడు. దీప నా గురించి బాధపడుతూ ఉండొచ్చు.. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని సుమిత్ర అంటుంది. ఉంటారని దశరథ్ అంటాడు. జ్యోత్స్న నువ్వు ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళకు టైమ్ దగ్గర పడిందని దశరథ్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అంటే ఆపరేషన్ కి అని దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







