Home

»

Tv News

Brahmamudi: కాపీ కొడుతూ దొరికిపోయిన ఐశ్వర్య.. రేఖకి ఇందు ఏం చెప్పనుంది?

Mar 08, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -974 లో.... ఇందుని ఎగ్జామ్ రాయడానికి బయటకు పంపించడానికి స్వాతి ఒక ప్లాన్ చేస్తుంది. భ్రమరాంబ ముందు కావాలనే ఒసేయ్ ఇందు ఈ బట్టలు స్టిచ్చింగ్ చేసుకొని తీసుకొని రా అని అంటుంది. అబ్బా ఇన్ని రోజులకి దానికి పని చెప్తున్నావే.. ఎప్పుడు అక్క అక్క అంటూ దాని వెనకాల తిరుగుతుంటే కోపం వచ్చేదని  భ్రమరాంబ అంటుంది. ఇప్పుడు అర్థం అవుతుంది అమ్మ ఎవరిని ఎక్కడ ఉంచాలో అని స్వాతి అంటుంది. 

నన్ను రేఖ ఆంటీ బయటకు వెళ్లకని చెప్పిందని ఇందు అనగానే అంటే నేను చెప్పినా వినవా.. ఇంకా మా అమ్మ చెప్తే కూడా వెళ్ళవా అని స్వాతి అంటుంది. ఎందుకు వెళ్ళదు వెళ్తుందని భ్రమరాంబ అంటుంది. నువ్వు నడిచి వెళ్లేసరికి లేట్ అవుతుంది. కార్ లో వెళ్ళమని స్వాతి చెప్తుంది. దాంతో ఇందు సరే అని వెళ్తుంది. నానమ్మ నేను వెళ్తున్నానని అపర్ణకి ఇందు చెప్పి వెళ్తుంది. అల్ ది బెస్ట్ అని అపర్ణ చెప్తుంది. 

ఆ తర్వాత ఇందు కార్ లో వెళ్తుంటే రాజు కార్ ముందు ఆగుతాడు. గొడవ చేస్తే డబ్బు ఇస్తారని డాష్ ఇస్తాడు. దాంతో కార్ వచ్చి డాష్ ఇచ్చినట్లు గొడవ చేస్తాడు. చుట్టుపక్కన వాళ్లంతా వస్తారు. ఇందు కార్ లో నుండి వస్తుంది. కార్ కి కెమెరా ఉంది. అంత రికార్డ్ అయింది. కేసు పెడితే డాష్ ఇచ్చిన అతను గొడవకి వచ్చినా మెరుపు జైలుకి వెళ్తారని అని ఇందు అనగానే రాజు భయపడుతాడు. చుట్టుపక్కన వాళ్లంతా భయపడి వెళ్తారు. ఆ తర్వాత రాజు పడిపోబోతుంటే ఇందు పట్టుకుంటుంది. ఏ డబ్బు అవసరం లేదని రాజు అనుకొని వెళ్తాడు. ఏదో చేసి డబ్బు వసూల్ చేద్దామని అనుకుంటే ఇలా అయిందని రాజు డిజప్పాయింట్ గా వెళ్తాడు. 

ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ దగ్గర దిగితే ఆంటీ కి ఒకవేళ డ్రైవర్ చెప్తాడేమోనని వేరొకచోట ఆగమని చెప్తుంది. ఆ తర్వాత నడుచుకుంటూ ఇందు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తుంది.

మరొకవైపు ఐశ్వర్య తన ఫ్రెండ్స్ కలిసి ఎగ్జామ్ కి చిట్టిలు రాసుకొని వస్తారు. లోపలికి వెళ్తారు. ఇందు ఎగ్జామ్ సెంటర్ అదే.. పైగా ఐశ్వర్యది, ఇందుది సేమ్ రూమ్. ఐశ్వర్యని చూసి ఇందు భయపడి మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తుంది. ఇన్విజిలేటర్ మాస్క్ తియ్యమని చెప్తాడు. దాంతో ఐశ్వర్యకి కనపడకుండా మాస్క్ ఇందు ఫేస్ ఇన్విజిలేటర్ కి చూపించి మళ్ళీ మాస్క్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఐశ్వర్య కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కి దొరికిపోతుంది. 

తరువాయి భాగంలో ఇందుని నువ్వు ఎక్కడికి వెళ్ళావని రేఖ అడుగుతుంది. స్టిచ్చింగ్ కోసమని ఇందు చెప్పగానే ఒకసారి ఆ టైలర్ షాప్ నెంబర్ ఇవ్వమని రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com