
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -413 లో... ధీరజ్ డల్ గా ఉన్నాడని డైవర్ట్ చెయ్యడానికి ప్రేమ ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది. తనకి ఐస్ క్రీమ్ కొనిస్తాడు. అయినా అలాగే డల్ గా ఉండడంతో ఎందుకురా టెన్షన్.. నా నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందామని ప్రేమ అనగానే నీ నగలకి ఒక దండమే తల్లి అని ధీరజ్ అంటాడు. మీ కామాక్షి అక్క భర్త మీ బావని అడుగు కదా అని ప్రేమ అనగానే.. మంచి ఐడియా ఇచ్చావని ధీరజ్ అంటాడు.
అప్పుడే అటుగా నర్మద వెళ్తూ కనిపిస్తుంది. అక్క అని పిలుస్తూ ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది అక్క డల్ గా ఉన్నావని ప్రేమ అడుగుతుంది. ఏం లేదని నర్మద అంటుంది. మీ కష్టాన్ని చెప్పుకోవడం లేదు.. ఇప్పుడు మీ బాధని కూడా చెప్పుకోరా అని ధీరజ్ అంటాడు. సాగర్ చేసిన దానికి నన్ను ఎంతో గౌరవించే మా ఆఫీస్ వాళ్ళు ఈ రోజు చులకనగా మాట్లాడారు. నా బాధని అత్తయ్యకి చెప్పుకోవాలని అనుకుంటే తను నన్ను దూరం పెట్టిందని నర్మద బాధపడుతుంది. సరే వదిన ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వెతుకుదాం పదండి అని ధీరజ్ అంటాడు.
మరొకవైపు రామరాజు మిల్ కి వెళ్తాడు. ఎక్కడ చందు నుండి మిల్ బాధ్యతలు తీసుకుంటాడోనని శ్రీవల్లి హడావిడిగా వెళ్తుంది. నాన్న వచ్చారా ఇక రోజు రండి అని చందు అనగానే ఏంటండీ మీరు మావయ్య ఏదో కాలక్షేపం కోసం వస్తే అలా అంటారు. వచ్చిన వాళ్లంతా బియ్యం ఎంత అని అడుగరు.. మీ సాగర్ ఇలా చేసాడట.. మీ కూతురు ఇలా చేసిందట అని అంటారని శ్రీవల్లి అనగానే అవును అమ్మ నేను మిల్ కి రాలేనని రామరాజు వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత తిరుపతి, రామరాజు కలెక్షన్ కి వెళ్తారు. ఇక నుండి మా తిరుపతి కలెక్షన్ కి వస్తాడని రామరాజు అంటాడు. మిల్ బాధ్యతలు ఇప్పుడు మా చందు చూసుకుంటున్నాడని రామరాజు చెప్తాడు. సాగర్ ఎక్కడికి వెళ్ళాడని షాప్ అతను అడుగుతాడు. అప్పుడే సేనాపతి వచ్చి.. వాడు ఎందుకు చెప్తాడు వాడి కూతురు లేచిపోయింది.. వాడి కొడుకు లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకున్నాడని సేనాపతి చెప్పగానే.. ఏదో పరువు గల కుటుంబం అనుకున్నా అని షాప్ అతను అంటాడు. దాంతో రామరాజు అవమానంగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత శ్రీవల్లి ఇంటికి వస్తుంది. మావయ్య మిల్ లో ఎలా ఉన్నాడని వేదవతి అడుగుతుంది. మీరు మావయ్య గురించి టెన్షన్ పడకండి అత్తయ్య.. ఇంటిని చూసుకోవడానికి నేనున్నాను.. మిల్ ని చూసుకోవడానికి మా అయన ఉన్నాడని శ్రీవల్లి అంటుంది. అప్పుడే ప్రేమ, నర్మద ధీరజ్ వస్తారు. నర్మద మాట్లాడుతుంటే వేదవతి కోపంగా మొహం పక్కకి తిప్పుకుంటుంది. శ్రీవల్లి తలనొప్పిగా ఉంది టీ తీసుకొనిరా అని వేదవతి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







