
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-407 లో.. భాగ్యం, ఆనందరావు, రామరాజు మాట్లాడుకుంటారు. ఏమైంది సాగర్ గురించి ఏదో అంటున్నావ్ ఏంటని రామారాజు అడుగగా.. మాకు తెలిసిన ఆమె సాగర్ ఏదో ఇరవై అయిదు లక్షలు లంచం ఇచ్చి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడని చెప్తుంది.. నేను నమ్మలేదు.. అందుకే వాట్సప్ లో వీడియో పంపిస్తానని అంది అంటుంది. దాంతో రామరాజు షాక్ అవుతాడు. అప్పుడే ఒక వీడియో వస్తుంది. అందులో సాగర్ లంచం తీసుకున్నాడని బ్రోకర్ చెప్పడం ఉంటుంది. దాంతో రామారాజు షాక్ అవుతాడు. ఇక సాగర్ మీద లేనిపోనివి అన్నీ చెప్పి ఫుల్ గా రెచ్చగొడతారు భాగ్యం, ఆనందరావు.
మరోవైపు సాగర్, నర్మదలతో పాటు ప్రేమ, ధీరజ్, శ్రీవల్లి చందు , తిరుపతి, వేదవతి అంతా పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కేక్ కట్ చేస్తుంటాడు సాగర్. అదే సమయంలో బ్రోకర్ కి భాగ్యం కాల్ చేసి.. మేము రావడం లేదు. మా పర్సన్ వస్తున్నాడు.. అయిదు లక్షలు ఇస్తాడు. అతడి ఫోటో పంపిస్తున్నాని చెప్తుంది భాగ్యం. రామరాజు ఫోటోని బ్రోకర్ కి పంపిస్తుంది భాగ్యం.

ఇక రామరాజు రాగానే బ్రోకర్ చూసి అతడిని ఆపి.. హలో నేనే ఏజెంట్ ని అయిదు లక్షలు తెచ్చావా అని అడుగుతాడు. దాంతో అతని చెంపచెల్లుమనిపిస్తాడు రామరాజు. ఇక అతను వెళ్లి పార్టీ జరిగే ప్లేస్ లో పడతాడు. దాంతో అందరు అతడినే చూస్తారు.
ఆ తర్వాత సాగర్ దగ్గరికి వెళ్లి చెంపచెల్లుమనిపిస్తాడు రామరాజు. సిగ్గులేదా పాతిక లక్షలు పెట్టి ఉద్యోగం కొనుక్కుంటావా అని సాగర్ ని తిడతాడు రామరాజు. ఏంటండి మీరు అనేది అని వేదవతి అంటుంది. ఉద్యోగం కొనుక్కున్నాడా అని చందు, ధీరజ్ అంతా షాక్ అవుతారు. వాడినే అడుగండి.. నేను చెప్పేది నిజమో కాదో వాడినే అడగండి అని రామరాజు కోప్పడతాడు.
ఏరా మీ నాన్న చెప్పేది నిజమేనా చెప్పరా మాట్లాడరా అని వేదవతి నిలదీస్తుంది. దాంతో అవును నిజమే అని నర్మద అంటుంది. ఇక సాగర్ మీద రామారాజు ఫైర్ అవుతాడు. ఏంటి రచ్చా.. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని నర్మద వాళ్ళ నాన్న ప్రసాదరావు అనగానే.. ఏంటయ్యా కూర్చొని మాట్లాడుకునేది.. అసలు వీడిని ఇలా చెడగొట్టింది మీరు అంటూ ప్రసాదరావు మీద రామరాజు సీరియస్ అవుతాడు.
అంత డబ్బు వీడికి ఎక్కడిదిరా అని వేదవతి అనగా ఆ వనజకి ఇవ్వాల్సిన డబ్బులని వాడుకున్నాడు.. మళ్ళీ ఆ వనజ వచ్చి నన్ను తిట్టాలని ఇలా చేశాడు వీడు అంటు రామరాజు తిడుతుంటే వనజ గారికి నా నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేశానని నర్మద చెప్పగానే అందరు షాక్ అవుతారు. నువ్వు కొడుకులని ఇలా పెంచావ్.. నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా అంటూ రామరాజుని ప్రసాదరావు తిడతాడు.
మాటలు జాగ్రత్త ప్రసాదరావు అని రామారాజు అనగా.. నీ కూతురు ఎవడితోనో లేచిపోయిందని ప్రసాదరావు అంటాడు. దాంతో ధీరజ్ అతడి కాలర్ పట్టుకుంటాడు. ఇక నర్మద ఇద్దరిని ఆపమంటుంది. పిలవకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చారు.. వెళ్ళిపోండి అని ప్రసాదరావు అనగానే రామరాజుతో పాటు అందరు వచ్చస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







