Home

»

Tv News

Karthika Deepam 2: మాలినికి సుమిత్ర వార్నింగ్.. సూరజ్ ని పెళ్ళి చేసుకుంటానన్న జ్యోత్స్న!

Nov 8, 2026 10:01AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-824 లో... సూరజ్, దశరథ గొడవ పడుతూనే ఉంటారు. దశరథ్ ను జ్యోత్స్న ఆపేందుకు ట్రై చేస్తుంది. సూరజ్‌ను కూడా ఆపుతుంది కానీ ఎవ్వరూ తగ్గరు. మతిపోయిందా అని జ్యోత్స్న అంటే మతిపోయింది నాకు కాదు వీళ్లకి, నా క్యారెక్టర్ గురించి తక్కువ మాట్లాడితే ఊరుకోనని సూరజ్ అంటాడు. నువ్వు ఏం చేసినా చూస్తూ ఉంటానా అని దశరథ్ మళ్లీ మీదకు వెళ్తాడు. అంతలో శౌర్య వచ్చి ఎందుకు కోప్పడుతున్నారని అడుగుతుంది. లేదు మాట్లాడుకుంటున్నామని చెప్పి శౌర్యతో పాటు అంతా ఇంటికి వెళ్తారు. 

ఇంటికి వెళ్లగానే శౌర్యను లోపలికి వెళ్లమని సుమిత్ర చెప్పి జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు, ఎందుకు కొట్టావని కార్తీక్ అడుగుతాడు. ఈరోజు ఇది చేసిన పని కోపం తెప్పించిందని చెప్పి సుమిత్ర కార్తీక్‌తో మాలినికి ఫోన్ చేయిస్తుంది. నువ్వు నీ కొడుకు కలిసి నా కూతుర్ని ఏం చేయాలనుకుంటున్నారు. బుద్ధి లేకుండా బయట ఎందుకు కలవాలి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐస్‌క్రీమ్ తినడానికి తీసుకెళ్లాడు.. బుగ్గపై ఐస్‌క్రీమ్ పడితే తుడిచేంత చనువా అని సుమిత్ర రెచ్చిపోయి తిడుతుంది. సూరజ్ చాలా మంచివాడని దక్షిణామూర్తి అంటే శివనారాయణ అరుస్తాడు. మాలిని నీ కొడుకును అదుపులో పెట్టుకోలేకపోతే చెప్పు నేను పెడతానని, కొడుకును కనడం కాదు పెంచడం తెలియాలని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. పీఏ అంటే ఆఫీస్ వరకే, బయట ఐస్‌క్రీమ్ తినిపించడానికి కాదని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. మాలిని అవమానంగా ఫీల్ అవుతుంది. అందరికి అర్థమైందిగా అంటే జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. జ్యోత్స్న తప్పు ఉండదని దీప సపోర్ట్ చేస్తుంది.

మరోవైపు సూరజ్ వచ్చి ఏమైందని అడిగితే మాలిని వెటకారంగా మాట్లాడుతుంది. మీ అత్త తిట్టిన తిట్లు చెప్పి మీరిద్దరూ ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తినండని అంటుంది. చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందని, జ్యోత్స్న శౌర్యతో వచ్చిందని సూరజ్ చెప్తున్నా మాలిని వినదు.. నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టే తిట్టిందని అంటుంది. దక్షిణామూర్తి ఇప్పుడు కోపంతో కాల్ చేస్తున్నారంటే దగ్గరైనట్లేగా అని షాక్ ఇస్తాడు.. మనవడా ఐస్‌క్రీమ్ తిన్నారన్నది సంతోషంగా ఉందని సూరజ్‌తో అంటాడు. ఇటు ఇంట్లో సుమిత్ర జ్యోత్స్నకు కాఫీ ఇచ్చి నీ చేతలు బాధపెడుతున్నాయని.. పెళ్లి చేయాలనుకుంటున్నామని, ఆఫీస్ మానేయమని అంటుంది. జ్యోత్స్న పెళ్లి చేసుకోనంటుంది. సూరజ్‌నే చేసుకుంటావా అని పారిజాతం అంటే కోపంతో అవును సూరజ్‌నే చేసుకుంటానని జ్యోత్స్న షాక్ ఇస్తుంది.‌ కానీ నాకు గోల్స్ ఉన్నాయి, మనం పోగొట్టుకున్న డబ్బు, ఆస్తి, పరువు అన్నీ తిరిగి తెచ్చాకే పెళ్లి అని, అప్పటివరకు అడగొద్దని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Karthika Deepam 2 Episode 824, Karthika Deepam 2 November 7th Episode, Karthika Deepam 2 Today Episode, Karthika Deepam 2 Latest Episode, Karthika Deepam 2 Star Maa, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com