Home

»

Tv News

Brahmamudi: రాజు, ఇందుల శోభనం వాయిదా.. నడుము చూపించి టెంప్ట్ చేసిన ఇందు!

Nov 8, 2026 9:34AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1183 లో... రాజును తలచుకొని చలపతి మండిపడుతూ లక్ష్మీని తిడతాడు. వెంకీ ఇంటర్వ్యూ అంటూ రాగానే నువ్వు ఇంటర్వ్యూకేనా లేక దుగ్గిరాల ఇంటికేనా అని నిలదీస్తాడు. ఆ రాజుగాడు ముళ్లకంప మీద ఉన్నాడని, దుగ్గిరాల కొంప కూడా ముళ్లకంపే అని వార్నింగ్ ఇస్తాడు. 

వెంకీ ఇంటర్వ్యూకి వెళ్తే ప్రొఫైల్ బాగుందని మెచ్చుకున్నా లాస్ట్ జాబ్ ఎందుకు మానేశావని అడుగుతారు. వెంకీ నిజం చెప్పడంతో జైలుకి వెళ్లి వచ్చిన వారికి జాబ్ ఇవ్వనని రిజెక్ట్ చేస్తారు. నిజాయతీకి విలువ లేదని వెంకీ బాధపడితే నందు వచ్చి ధైర్యం చెప్తుంది.

అటు దుగ్గిరాల ఇంట్లో లక్కీ వచ్చి రాజుకి క్షమాపణ చెప్తాడు.. కానీ రాజు అస్సలు ఒప్పుకోడు. ప్రాణం పోయినా ఫ్రెండ్ రహస్యాన్ని బయటపెట్టకూడదని, నీపై నమ్మకం పోయిందని ఫ్రెండ్షిప్ కట్ అంటాడు. తోడల్లుళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నా ముఖం తిప్పుకుని వెళ్తానని తెగేసి చెప్తాడు. 

మరోవైపు రాజు, ఇందు శోభనం కోసం పంతులుని పిలుస్తారు.రాజు తహతహలాడుతూ ఇందు కొంగు పట్టుకుని తిరుగుతుంటాడు. పంతులు పంచాంగం చూసి తాళి కట్టిన ముహూర్తం బాలేదని..శాంతి పూజ చేయాలని, మూడు రోజులు దూరంగా ఉండి మూడో రోజు రాత్రి 10:30 కి శోభనం జరపాలని చెప్తాడు. రేఖ హీరోలా ఎంట్రీ ఇచ్చి తాళి కడితే ఇలాగే ఉంటుందని వెటకారం చేస్తుంది.

మూడు రోజులు వాయిదా పడటంతో అపర్ణ రాజుని గదిలోకి వెళ్లొద్దని హాల్లోనే పడుకోమని ఆర్డర్ వేస్తుంది. కానీ గదిలో ఇందు స్నానం చేసి వచ్చి జుట్టు ఆరబెడుతూ కావాలనే నడుము చూపించి రాజుని టెంప్ట్ చేస్తుంది. రాజు తట్టుకోలేక నడుము గిల్లడానికి ట్రై చేస్తే ఇందు హెయిర్ స్ట్రెయిటనర్ తో వాత పెట్టి బయటకు పంపేస్తుంది. వేలు పట్టుకుని హాల్లోకి వచ్చిన రాజుని శేషు ఆట పట్టిస్తాడు. 

ఎపిసోడ్ చివర్లో రాజు సీతారామయ్య, ఇందిరాదేవి ఫొటోలు తెచ్చి హాల్లో పెట్టబోతే స్టోర్ రూమ్ లో పెట్టమని రేఖ అంటుంది. దీంతో రాజు రెచ్చిపోయి రేఖ తల్లి, అన్న ఫొటోలు తీసి పారేసి పెద్దవాళ్ల ఫొటోలు పెడతాడు. దీంతో రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Brahmamudi Serial Episode 1183, Brahmamudi November 8th episode, Brahmamudi Today Episode, Brahmamudi Latest Episode, Brahmamudi Star Maa, Raju Indu, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com