Karthika Deepam 2 : జ్యోత్స్నపై పారిజాతానికి డౌట్.. శ్రీధర్ డ్యుయల్ రోల్!
on Apr 20, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -336 లో... దశరథ్ స్పృహలోకి వస్తాడు. సుమిత్ర, శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్లి దశరథ్ ని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మీరేం మాట్లాడకండి తల ఊపండి అంతే అని దశరథ్ తో డాక్టర్ చెప్తాడు. ఇక కాసేపటికి దశరథ్ కి ఇక ఏ ప్రాబ్లమ్ లేనట్లే అని డాక్టర్ చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరొకవైపు స్వప్న, కాశీ ఇద్దరు దీప దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఆ మాట దాస్ విని మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. మీకు దీప తెలుసు కదా దశరథ్ గారిని షూట్ చేసిందని అంటున్నారని స్వప్న చెప్పగానే.. తను అలా చేయదు అదే చేసి ఉంటుందని దాస్ ఆవేశపడుతుంటే దాస్ ని కాశీ గదిలో వేసి డోర్ పెడతాడు. వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. మరొకవైపు కావేరి దగ్గరికి శ్రీధర్ వచ్చి దశరథ్ బావ స్పృహలోకి వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఆ దీపకి శిక్ష పడుతుందని శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అందరివి తనే డ్యుయల్ రోల్స్ ప్లే చేసి ఆనందపడతాడు. ఆ తర్వాత దీప ఉండదు కాబట్టి కార్తీక్ కి జ్యోత్స్నకి పెళ్లి చేస్తానని కావేరితో శ్రీధర్ అంటాడు.
ఆ తర్వాత పారిజాతానికి జ్యోత్స్న పై డౌట్ వస్తుంది. నువ్వే కావాలని దీపని ఇరికించలేదు కదా అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. లేదు దాని ఆవేశంతో ఒక ఛాన్స్ ఇచ్చింది. మనకి బావ ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు అంతే గానీ ఇలా అడగకు అని జ్యోత్స్న కోప్పడుతుంది. దాస్ దగ్గరికి డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తాడు. మావయ్యని కొన్ని రోజులు దూరంగా తీసుకొని వెళ్ళాలని కాశీతో స్వప్న అంటుంది. సరే అని కాశీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
