వెడ్డింగ్ కార్డ్ తో కళ్యాణ్ కి లవ్ ప్రపోజల్!
on Sep 21, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -206 లో.. కావ్య తన పుట్టింటికి వెళ్ళడానికి అపర్ణ అనుమతి తీసుకోగ అపర్ణ వెళ్ళమని చెప్తుంది. ఈ రోజుతో కాంట్రాక్టు పూర్తవుతుంది. మా పుట్టింటి వాళ్ళ అప్పు తీరిపోయి వాళ్ళకి ఇల్లు సొంతం అవుతుందని సీతారామయ్య, ఇందిరాదేవిల దగ్గర కావ్య ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది.
మరొక వైపు అనామికని కలవడానికి కళ్యాణ్ వెళ్తాడు. అప్పు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యకుండా అనామికని కలిసి గుడ్ న్యూస్ తో అప్పుని కలుస్తానని కళ్యాణ్ అనుకుంటాడు. కాఫీ షాప్ లో అనామికని కలుస్తాడు. అనామిక ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చి.. ఇది నా వెడ్డింగ్ కార్డు చదువు అని అనగానే కళ్యాణ్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కార్డు లో కళ్యాణ్ పేరు ఉండడం, అబ్బాయి అతనే అని సంబరపడిపోయి అనామికని హగ్ చేసుకుంటాడు. మీ కవితలే కాదు మీరు కూడా ఇష్టమని కల్యాణ్ తో అనామిక చెప్తుంది. ఒక వైపు కృష్ణమూర్తి దగ్గరికి కావ్య వెళ్తుంది. మిగిలిన బొమ్మలకు కలర్ లు వేస్తుంది. మరొకవైపు రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి.. ఈ రోజుతో కావ్య చేసే కాంట్రాక్ట్ పూర్తి అవుతుందంట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కావ్య పుట్టింటి వాళ్ళకి ఇల్లు సొంతం కాకూడదని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. నేను చూసుకుంటానని రాహుల్ అంటాడు.
మరొక వైపు సీతరామయ్యకి రాజ్ ఫోన్ చేసి.. టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. నేను వేసుకున్న కానీ నీ భార్య పుట్టింటికి వెళ్ళింది. వస్తుందా లేదా అని ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదా అని సీతారామయ్య అడుగుతాడు. సరే చేస్తానని రాజ్ అనగానే.. అవసరం లేదు కావ్య రావడం లేట్ అవుతుంది అంట అని సీతరామయ్య చెప్తాడు. సరే నేను వెళ్లి తీసుకొని వస్తానని రాజ్ అనగానే.. సీతరామయ్య హ్యాపీగా ఫీల్ అయి సరే అంటాడు. ఆ తర్వాత కావ్యని తీసుకొని రావడానికి రాజ్ తన అత్తగారింటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



