
బిగ్ బాస్ సీజన్-10 పదకొండో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక నిన్నటి శుక్రవారం నాటి కెప్టెన్సీ రేస్ లో అమన్ గెలిచి పన్నెండో వారానికి గాను కెప్టెన్ గా నిలిచాడు.
హౌస్ లో ఈ వారం నుండి డిక్టేటర్స్ టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో త్రిగుణ్ వర్సెస్ ముఖేష్ మధ్య ఆధిపత్యం కోసం పోటీ నడుస్తోంది. అయితే మొదటి నుండి త్రిగుణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది. అయితే రంగు పూసుకునే టాస్క్ లో ముఖేష్ గెలిచాడు. ఆ తర్వాత త్రిగుణ్ గెలిచాడు. ఇలా ఒక్కో రోజు ఒక్కొక్కరుగా ఆధిపత్యం సాధించారు. అలా ఈ వారం డిక్టేటర్స్ మధ్య పోటీ సాగింది.
టాస్క్ లో డిక్టేటర్ అయిన ముకేశ్ కూడా పాల్గొన్నారు. కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం దక్కించుకోవడం కోసం ముకేశ్, నీతూ, ఆర్కే గేమ్ లో పోటీ పడ్డారు. కానీ నీతూ విజయం సాధించి కంటెండర్ గా అవకాశం దక్కించుకుంది. దీనితో నీతూ, అమన్, దేబ్జానీ, శివకుమార్ కెప్టెన్సీ పోటీలో పాల్గొన్నారు. ఎవరికీ కేటాయించిన బ్లాక్స్ ని వేగంగా నిలబెట్టి ఆ తర్వాత పడగొట్టాలి. ఎవరు ముందుగా ఈ టాస్క్ ఫినిష్ చేస్తే వాళ్లే విజేతలు. ఈ టాస్క్ లో అమన్ విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరించారు. కెప్టెన్సీ దక్కించుకోవడం మాత్రమే కాదు. అతడికి అల్టిమేట్ పవర్ కూడా దక్కింది. అల్టిమేట్ పవర్ అంటే టికెట్ టు ఫినాలే టాస్క్ లో పాల్గొనే కంటెండర్ గా ఛాన్స్ దక్కడం.





