.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 11వ వారం ఓటింగ్‌లో లేటెస్ట్ ట్రెండ్ బయటకు వచ్చింది. నామినేషన్స్‌లో ఉన్న 11 మందిలో త్రిగుణ్ మరోసారి అందరికంటే ముందున్నాడు. ఓటింగ్ మొదలైనప్పటి నుంచి త్రిగుణ్, ముఖేష్ మధ్యే టాప్ కోసం గట్టి పోటీ నడుస్తోంది.
లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం త్రిగుణ్ - 30.51% (54,423 ఓట్లు) తో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ముకేష్ - 28.95% (51,646 ఓట్లు) తో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరికీ మిగిలిన వారితో పోలిస్తే భారీ ఓట్లు పడుతున్నాయి. వీరిద్దరి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండటంతో టాప్ ప్లేస్ ఎవరికి దక్కుతుందో చివరి వరకు ఉత్కంఠగా మారింది. ఇక మూడో స్థానంలో అమన్ - 7.18% (12,803 ఓట్లు), నాలుగో స్థానంలో దేబ్జానీ - 6.96% (12,416 ఓట్లు) ఉన్నారు. ఐదో స్థానంలో రామకృష్ణ - 5.38% (9,590 ఓట్లు) తో సేఫ్ జోన్‌లో కనిపిస్తున్నాడు.
మిడిల్‌లో మాత్రం పరిస్థితి చాలా టైట్‌గా ఉంది. రామ్ ప్రసాద్ - 4.54% (8,102 ఓట్లు), వర్షిణి - 4.38% (7,810 ఓట్లు), వంశీ - 4.37% (7,801 ఓట్లు), సుధీర్ - 4.34% (7,738 ఓట్లు) తో ఒకరి వెనుక ఒకరు ఉన్నారు. వీరిలో ఎవరైనా ఒక్కసారిగా పైకి లేదా కిందకు వెళ్లే ఛాన్స్ ఉంది.అత్యంత డేంజర్ జోన్‌లో శివ్ - 1.76% (3,139 ఓట్లు), నీతూ - 1.64% (2,925 ఓట్లు) ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తే ఈ వారం నీతూ లేదా శివ్‌లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇది అనధికారిక ఆన్‌లైన్ ఓటింగ్ మాత్రమే. అసలు ఫలితం వీకెండ్‌లో నాగార్జున చెప్పే వరకు వేచి చూడాలి.




.webp)

