Home

»

Tv News

Jayam serial : జయకు పెళ్లి చేసి పంపించేయాలని విశ్వ సంచలన నిర్ణయం.. వీరు మాస్టర్ ప్లాన్!

Jul 17, 2026 10:44AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -322 లో....ఇషిక పూజ చేస్తుంటే అందరు షాక్ అవుతారు. అప్పుడే సూర్య వచ్చి ఏంటి ఈ వింత అని అంటాడు.‌ ఇషిక పూజ అయ్యాక అందరికి హారతి ఇస్తుంది. రుద్ర హారతి తీసుకుంటుంటే దీపం ఆరిపోతుంది. దాంతో రుద్ర షాక్ అవుతాడు. ఏంటి గంగ గురించి మొక్కుకుంటే ఇలా అయిందని కంగారుపడతాడు. ఎందుకు అయినా మంచిది గంగని జాగ్రత్తగా ఉండమను అని శకుంతల అంటుంది. మరొకవైపు జయ చేసిన గొడవ విశ్వకి తెలుస్తుంది.

ఏంటి జయ నువ్వు ఒంటరిగా పెరిగానంటావ్ ఒంటరిగా పెరిగితే బంధాలు పెంచుకుంటారు కానీ ఇలా అవమానించారు ఇక నువ్వు ఇక్కడ అవసరం లేదు నిన్ను హాస్టల్ లో ఉంచి చదివిస్తానని విశ్వ అనగానే ఎందుకు అలా అంటున్నారని సుధా అంటుంది. నా నిర్ణయం ఫైనల్ అని విశ్వ చెప్పి వెళ్తుంటే అప్పుడే వీరు వచ్చి బాబాయ్ మీరు తీసుకున్న నిర్ణయం తప్పు.. తనకి పెళ్లి చెయ్యండి అప్పుడు బంధాల గురించి తెలుస్తుందని వీరు సలహా ఇస్తాడు.‌ దాంతో‌ జయ షాక్ అవుతుంది. మంచి సలహా ఇచ్చావ్ రేపే వెళ్లి మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కలుస్తానని విశ్వ అంటాడు. జయ, వీరు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. ఇప్పుడు పెళ్లి ఏంటని జయ కోప్పడుతుంది.  అప్పుడే నువ్వు విశ్వనాథ్ కూతురు అని ప్రపంచానికి తెలుస్తుంది.‌ పైగా ఆస్తులు ఇచ్చి మరి పెళ్లి చేస్తారని వీరు అంటాడు. పేరుకే పెళ్లి అని వీరు అనగానే జయ సరే అంటుంది.

మరొకవైపు రంగ, గంగ మార్కెట్ నుంచి వస్తుంటే కొంతమంది రౌడీలు గంగని పోటీ నుంచి తప్పుకో లేదా ఓడిపోమని బెదిరిస్తాడు. గంగ ఎదురు తిరిగి మాట్లాడాలని ట్రై చేస్తుంటే తనని కత్తితో పోడవడానికి ట్రై చేస్తారు రౌడీలు. అప్పుడే రుద్ర వచ్చి సేవ్ చేస్తాడు.‌ ఆ విషయాలన్నీ రుద్ర, గంగ ఇంటికి వెళ్లి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com