Home

»

Tv News

లైవ్‌లోనే తన రిలేషన్‌షిప్‌పై అఖిల్ అక్కినేని షాకింగ్ కామెంట్స్!

Jul 16, 2026 4:06PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఈ ఎపిసోడ్ కి లెనిన్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. "అమ్మాయిల కలల రాజకుమారుడు, అభిమానుల గుండెల్లో అయ్యగారు, సిల్వర్ స్క్రీన్ పై సునామి సృష్టించిన అఖిల్ అక్కినేని " అంటూ గట్టిగా పరిచయం చేసింది శ్రీముఖి. ఇక హీరోయిన్ స్టేజి మీదకు రాకపోయేసరికి అఖిల్ "ఏయ్ బంగారం " అని పిలిచాడు. వెంటనే హీరోయిన్ కూడా వచ్చేసి అఖిల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈ ప్రోమోలో కనిపించిన దీపికా హీరో అఖిల్ అని ఆటపట్టించింది. "ఆడుకుందాం రా ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " అంది .

"నేనింక ఎలిజిబుల్ కాదమ్మా " అని చెప్పాడు అఖిల్. దాంతో దీపికా బుంగమూతి పెట్టింది. స్టేజి మీద ఉన్నవాళ్ళంతా నవ్వేశారు. "ఆయనే అది మర్చిపోయి ఈ సెట్ కి వచ్చారు " అని మళ్ళీ కౌంటర్ వేసింది దీపికా. "మర్చిపోలేదు , అస్సలు మర్చిపోలేదు " అని చెప్పాడు. తర్వాత కర్రసాము చేసి "వాసి వాడి తస్సాదియ్యా" అంటూ వాళ్ళ నాన్న నాగార్జున నటించిన "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీలోని డైలాగ్ చెప్పి ఆ  సిలంబం స్టిక్ ని స్టేజి మీద గట్టిగా కొట్టి కొట్టాడు. తండ్రికి తగ్గ తనయుడు ఎక్కడా తగ్గేదిలే అన్నట్టు కనిపించాడు.

ఇక ఈ ప్రోమో కింద నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. " మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విజయం   "లెనిన్" రూపంలో ఇన్నాళ్లకు మీకు లభించినందుకు తెలుగు ప్రేక్షకులు అందరి తరపున హృదయపూర్వక  శుభాకాంక్షలు"అఖిల్" గారు... అయ్యగారే నంబర్ వన్ ...సమంత  రాకతో  ఆదివారం  షోకి  స్టార్  స్టేటస్  వచ్చింది , ఇక  స్టార్స్  ఈ   షోకి  క్యూ  కడతారు , తెలుగులో  వన్  అఫ్  ది  టాప్  షో ... " అంటూ అఖిల్ కి విషెస్ చెప్తున్నారు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com