
స్టార్ మా టీవీలో ప్రసరమావుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -159 లో... కానిస్టేబుల్ ధర్మేంద్ర కోసం చక్రి వెయిట్ చేస్తాడు. అప్పుడే అతను వస్తాడు. ఏంటి అర్జెంట్ గా పిలిచావని అతను అడుగుతాడు. మీరు నా భార్యకి ఒకసారి వార్నింగ్ ఇచ్చారు.. విడాకులు తీసుకోవద్దని కానీ తను మళ్ళీ ఆ ప్రయత్నం ఆపడం లేదు.. మళ్ళీ విడాకులకి అప్లై చేసిందని చక్రి చెప్తాడు. సరే నేను వార్నింగ్ ఇస్తాను ఒక అయిదు వందలు కొట్టు అని కానిస్టేబుల్ అనగానే చక్రి డబ్బు ఇస్తాడు.
మరొకవైపు శైలు రావట్లేదని కేశవ చూస్తుంటాడు. ఈ బుస్స్ ఏంట్రా ఇంకా రావడం లేదని బంటితో కేశవ అంటాడు. ఉన్నప్పుడు పట్టించుకోవు.. ఇప్పుడు కలవరిస్తున్నావని బంటి అంటాడు. ఆ తర్వాత శైలుకి ఏదో మెసేజ్ చెయ్యబోయి ఆగిపోతాడు. మరొకవైపు మహాని మాధవ విడాకుల గురించి అడుగుతాడు. ఇంకా ఆరు నెలలు టైమ్ పడుతుందనగానే మాధవ రిలాక్స్ అవుతాడు. దేవుడికి మొక్కుకుంటాడు. ఆ తర్వాత మహాకి ధర్మేంద్ర కాల్ చేసి నా మాట అంటే లెక్క లేదా మళ్ళీ విడాకులు అంటున్నావని కోప్పడతాడు. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసని మహా అడుగుతుంది నేను పోలీస్ అని కానిస్టేబుల్ అంటాడు. ఇంకొకసారి విడాకులు అంటే అసలు ఊరుకోనని మహాకి ధర్మేంద్ర వార్నింగ్ ఇస్తాడు. దాంతో సరేనని మహా అంటుంది. అసలు ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయని మహా అనుకుంటుంది.
మరొకవైపు కేశవ దగ్గరికి శైలు వస్తుంది. ఏదో మెసేజ్ చెయ్యబోయ్ ఆగావు ఏంటని అడుగుతుంది. నీకు కాదు వేరే వాళ్ళకి చెయ్యబోయ్ చేసానని కేశవ అనగానే శైలు అలుగుతుంది. దాంతో తనని బుజ్జగిస్తాడు కేశవ. ఆ తర్వాత చక్రి ఇంటికి వస్తాడు. ఆ కానిస్టేబుల్ కి ఎవడు చెప్పాడో ఏంటో విడాకుల గురించి అని మహా తిడుతుంటే చక్రి ఇబ్బంది పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
