Home

»

Tv News

Podharillu : చక్రికి ఊహించని షాక్ ఇచ్చిన మహాలక్ష్మి.. విడాకుల ప్లాన్ రివర్స్!

Jul 7, 2026 11:34AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -151 లో..... శైలు, కేశవ కలిసి ఉండడం వాళ్ళ నాన్న చూసి గొడవ చేస్తాడు. ఆ తర్వాత ఏంటే మీ నాన్నతో అంతలా మాట్లాడావని కేశవ అంటాడు. నా ధైర్యం నువ్వే అని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి రండి అని మాధవ పిలుస్తాడు. నాకు ఆకలిగా లేదని కేశవ వెళ్తాడు. వాడికి ఏమైందని మాధవ అంటాడు. నేను వెళ్లి కనుక్కుంటానని చక్రి వెళ్తాడు. ఏమైంది రా ఆ బుస్సు గురించి ఏమైనా ప్రాబ్లమ్ ఆ అని చక్రి అడుగుతాడు. అవును రా అని కేశవ జరిగింది మొత్తం చెప్తాడు. అది చక్రి విని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు లవ్ లో పడడం ఏంట్రా అని అంటాడు. సరే ఏదైనా ప్రాబ్లమ్ అయితే నేను చూసుకుంటానని కేశవతో చక్రి చెప్తాడు.

ఆ తర్వాత శైలు ఇంటికి రాగానే వాళ్ళ నాన్న తనపై కోప్పడతాడు. వరాలు అప్పుడే వస్తుంది. విషయం తెలిసి శైలుని కొడుతుంది. నేను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని శైలు ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడే శైలు వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఏం లేదని కవర్ చేస్తారు. మరుసటి రోజు మహా అందరిని పిలిచి.. మేం లాయర్ దగ్గరికి వెళ్తున్నాం మాది ఎలాగూ నిజమైన పెళ్లి కాదు కదా అని మహా అంటుంది. ఆ తర్వాత చక్రి బాధపడుతూ తను విడాకులు కావాలి అనుకుంటుంది కదా ఇస్తాను.. విడాకులు రావడానికి ఆరు నెలలు టైమ్ పడుతుంది కదా... అప్పుడు మళ్ళీ ప్రేమిస్తానని మాధవ, కేశవ వాళ్ళతో చక్రి చెప్తాడు. ఆ తర్వాత కేశవ దగ్గరికి శైలు వస్తుంది. రాత్రి గొడవ జరిగింది నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోననని ఇంట్లో చెప్పానని శైలు చెప్తుంది. మా చక్రికి మహాలక్ష్మికి గొడవలు జరుగుతున్నయి. వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలని కేశవ అనగానే సరే వాళ్ళని ఇప్పుడు విడగొడితే ఆ దూరం భరించలేక దగ్గర అవుతారని శైలు అంటుంది. ప్లాన్ బాలేదని కేశవ అంటాడు.

ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ గా ఉండడం శైలు వాళ్ళ అన్నయ్య చూస్తాడు. కోపంగా ఇంటికి వెళ్తాడు. శైలు మెకానిక్ తో తిరుగుతుందని అతను అనగానే ఆ విషయం మాకు తెలుసని శైలు పేరెంట్స్ అంటారు. అప్పుడే శైలు వస్తుంది. శైలుపై వాళ్ళ అన్నయ్య కోప్పడుతాడు. నేను కేశవని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని శైలు చెప్తుంది. దాంతో వాళ్ళ అన్నయ్య కోపంగా తన ఫ్రెండ్స్ ని తీసుకొని కేశవ ఇంటికి వెళ్తాడు. అక్కడ చక్రి ఉంటాడు. నువ్వేనా నా తమ్ముడు బామ్మర్ది అని చక్రి అంటాడు. ఏంట్రా అని మాధవ అనగానే కేశవ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.. ఆ అమ్మాయి వాళ్ళ అన్న వీడు అని చక్రి చెప్పగానే నారాయణ, మాధవ వాడు ప్రేమిస్తున్నాడా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో కేశవ ఇంటికి శైలు పేరెంట్స్ వస్తారు. మీ వాడు మా అమ్మాయి వెనకాల పడొద్దని వార్నింగ్ ఇస్తారు. కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతుంటే అప్పుడే మహా వచ్చి.. ఆపండి ఈ ఇంటికి ఏ కోడలు రాదని అన్నారు కదా.. నేను వచ్చాను కదా.. ఇదిగో తాళి చక్రి భార్యని అని మహా అనగానే చక్రి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com