Home

»

Tv News

Jayam serial : శకుంతల ఆశీర్వాదంతో నయా జోష్!

Jun 3, 2026 10:48AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -284 లో.....బాక్సింగ్ కాంపిటీషన్ గురించి గంగ టెన్షన్ పడుతుంటే.. రుద్ర వెళ్లి తనకి ధైర్యం చెప్తాడు. నువ్వు వెళ్లి పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. అమ్మగారికి నేను వెళ్లడం ఇష్టం లేదు.. అలాంటిది నన్ను ఆశీర్వదిస్తుందా అని గంగ అంటుంది. ఆ తర్వాత శకుంతల ఇంట్లో పూజ చేస్తుంది. అందరు హాల్లోకి వస్తారు. శకుంతల అందరికి హారతి ఇస్తుంది కానీ గంగ, రుద్రలకి మాత్రం ఇవ్వదు. ముందు వెళ్లి దేవుడికి మొక్కుకోమని శకుంతల అనగానే గంగ హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్లి దేవుడికి మొక్కుకుంటుంది.

ఆ తర్వాత హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుంది. విజయేంద్ర ప్రతాప్ కుటుంబం ఎంత గొప్ప కుటుంబమో అందరికి తెలుసు.. నువ్వు కచ్చితంగా ఈ పోటీలో విజయం సాధించి మంచి పేరు తీసుకొని రావాలని శకుంతల అనగానే గంగ, రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగికి దగ్గరుండి అన్ని ఇన్ స్ట్రక్షన్స్  చెప్పమని రుద్రకి శకుంతల చెప్తుంది. అందరు గంగకి అల్ ది బెస్ట్ చెప్తారు. గంగని తీసుకొని రంగా, రుద్ర వెళ్తారు. ఆ తర్వాత అసలు ఏంటి బ్రో ఇలా జరిగిందని ఇషిక వీరు డిస్సపాయింట్ అవుతారు. శకుంతల అత్తయ్య గంగకి పాజిటివ్ అవ్వడం ఏంటని డిస్సపాయింట్ అవుతారు. మరొకవైపు విశ్వ సెలక్షన్ జరిగే దగ్గరికి చీఫ్ గెస్ట్ గా వెళ్తాడు.

అక్కడ ధీరజ్ ఎదరుపడి విశ్వకి బొకే ఇస్తాడు. మా ఫ్రెండ్ సిస్టర్ కూడా పార్టిసిపేట్ చేస్తుందని చెప్తాడు. తను బాక్సింగ్ ప్రాక్టీస్ చెయ్యడం చూసి అమ్మాయి బాగా చేస్తుంది గంగకి కంపిటేషన్ అనుకుంటా అని విశ్వ అనుకుంటాడు. ఆ తర్వాత ధీరజ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నువ్వు పోటీలో సెలెక్ట్ కాకపోయినా పర్వాలేదు కాని ఆ గంగ కాళ్ళు రెక్కలు విరగొట్టమని ఆ అమ్మాయికి ధీరజ్ చెప్తాడు. మరొకవైపు గంగ కార్ లో వస్తు డల్ గా ఉంటుంది. అందరు తనపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం నిలబెడుతానో లేదో అని భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com