.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -127 లో..... ఆ చక్రి ఎప్పుడు అంత డబ్బులు చూసి ఉండడు అంత డబ్బులు చూసేసరికి డబ్బుతో పారిపోయాడని లలిత అనగానే అమ్మ నువ్వు ఆపు వాళ్ళ గురించి నాకు తెలుసు ఎలాంటి వారో.. నాకు తెలుసు డబ్బు ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు.. మనుషులకి విలువ ఇస్తారని మహా అంటుంది. మీరు అంటున్నారు కాబట్టి చక్రి కోసం వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తానని మహా అంటుంది. ఆ తర్వాత కేశవకి మహా ఫోన్ చేసి చక్రి అక్కడికి వచ్చాడా అని అడుగుతుంది. అదేంటీ మీ ఇంట్లో ఉండాల్సిన వాడు ఇక్కడికి ఎలా వస్తాడని కేశవ అంటాడు.
బయటకు వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు అందుకని కాల్ చేసానని మహా అంటుంది. ఆ తర్వాత చక్రిని రౌడీలు కొట్టే వీడియోని ప్రతాప్, లలిత, ఆది చూసి నవ్వుకుంటారు. వాడిని మహా దృష్టిలో దొంగని చేసి మహాని వాడిని శాశ్వతంగా దూరం చేస్తానని ప్రతాప్ అంటాడు. అప్పుడే మహా వస్తుంది. విన్నదేమో అనుకొని భయపడుతారు కానీ మహా అదంతా ఏం వినదు. నేను వాళ్ళ ఇంటికి కాల్ చేసాను అక్కడికి రాలేదట అని మహా చెప్తుంది. ఆ తర్వాత శైలు తన ఫ్రెండ్ తో కలిసి కేశవకి డబ్బు ఇవ్వడానికి మెకానిక్ షాప్ దగ్గర వస్తుంది కానీ అక్కడ కేశవ ఉండడు.ఆ తర్వాత మహా దగ్గరికి లలిత వస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని మహా అనగానే వాడు పారిపోయాడు కాబట్టి స్విచ్చాఫ్ వస్తుంది. నీ పిచ్చి గానీ ఇంకా అర్థం అవ్వడం లేదా అని లలిత అంటుంది.
నువ్వేం అన్నా వింటాను కానీ దొంగ అంటే ఒప్పుకోనని లలితపై కోప్పడుతుంది మహా. ఆ తర్వాత కేశవకి శైలు ఫోన్ చేస్తుంటే చిరాకుగా లిఫ్ట్ చేసి ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే చంపేస్తానని కేశవ అంటాడు. ఆ తర్వాత చక్రి ఇంటికి వెళ్ళలేదట వదిన ఫోన్ చేసిందని మాధవ వాళ్ళకి కేశవ చెప్తాడు. ఆ తర్వాత మహాతో మాధవ మాట్లాడుతాడు. తను జరిగింది మొత్తం చెప్తుంది. మహా ఫోన్ కట్ చేసాక ఆ ప్రతాప్ మన చక్రితో ఛాలెంజ్ చేసాడట.. వాడే ఏదో చేసి ఉంటాడని కేశవ అంటాడు. ఆ తర్వాత చక్రిని కిడ్నాప్ చేసిన దగ్గరికి ప్రతాప్, ఆది వచ్చి రౌడీలతో మాట్లాడతారు. కానీ చక్రికి వాళ్ళ మొహాలు కనిపించవు. తరువాయి భాగంలో ఇక అలాంటివాడు నీ లైఫ్ లో వద్దని మహాతో ప్రతాప్ అంటాడు. మరొకవైపు మాధవ వాళ్ళు చక్రి కోసం వెతుకుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






