.webp)
ప్రేమ ఎవ్వరికైనా ప్రాణం పోస్తుంది అంటారు. అలాంటి ఇష్టమైన వాళ్లకు ప్రేమ లేఖను రాయడం అంటే ఊహకు అందని విషయం. అలాంటి ప్రేమ లేఖను రాసాడు ప్రదీప్. ఇంతకు ఎవరికీ ఆ ప్రేమలేఖ అన్నది మాత్రం చెప్పలేదు. ఎవరైనా సిగ్గుమొగ్గలవుతారు కానీ కుక్కు విత్ జాతిరత్నాలు లేటెస్ట్ ప్రోమోలో ప్రదీప్ ప్రేమ మొగ్గలయ్యాడు. "ప్రియాతి ప్రియమైన ...మీరంటే నాకు చాలా ఇష్టం " అని ప్రేమలేఖ రాస్తూ తెగ సిగ్గుపడిపోయాడు హోస్ట్ ప్రదీప్.
ఇక స్టేజి మొత్తం లవ్ అంటూ రెడ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. జడ్జెస్ అంతా కూడా అద్దిరిపోయే కాస్ట్యూమ్స్ తో సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సంజయ్ తుమ్మ బ్లాక్ డ్రెస్ లో శ్రీదేవి రెడ్ శారీలో అలీ బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్ లో , ముచ్చెర్ల అరుణ లైట్ వైట్ కలర్ శారీలో వచ్చారు. సంజయ్ తుమ్మ ఐతే ఒక కవిత కూడా చెప్పేసారు. "ఈ ప్రేమ ప్రపంచంలోకి ప్రదీప్ మీకు ఆహ్వానం పలుకుతున్నాడు" అన్నాడు.
"బ్లాక్ అండ్ రెడ్ ఈజ్ సో బ్యూటిఫుల్, వెన్ థె ఆర్ టుగెదర్ ఇట్ ఈజ్ సో టైట్ ...బూమ్ బూమ్ బూమ్ " అంటూ వేళ్ళతో హార్ట్ షేప్ పెట్టేసరికి శ్రీదేవి ఒక వికారమైన ఫేస్ పెట్టింది. తరువాత ఇద్దరూ కలిసి ఒక డ్యూయెట్ స్టెప్ వేశారు. తర్వాత ముచ్చెర్ల అరుణ తన ప్రేమ విషయం చెప్పారు. "నాది లవ్ మ్యారేజ్. మా ఆయన పంజాబీ. నేను సౌత్ ఇండియన్ . " అని చెప్పారు. వెంటనే ప్రదీప్ "స్టార్టింగ్ లోనే పాన్ ఇండియా ఎలా ప్లాన్ చేశారు" అని ఫన్నీ కౌంటర్ వేసాడు.




.webp)
