Home

»

Tv News

Podharillu : చక్రిని దొంగగా మార్చేందుకు ప్రతాప్ గ్యాంగ్ భారీ స్కెచ్.. కిడ్నాప్ డ్రామాతో షాక్!

Jun 2, 2026 9:58AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -126 లో...... ఆది, లలిత, ప్రతాప్ ముగ్గురు కలిసి చక్రి ని మహాని ఇద్దరిని దూరం చేయాలని అనుకుంటారు. అందులో భాగంగా ఆది తన కాలికి దెబ్బ తగిలినట్లు యాక్టింగ్ చేస్తాడు. అయ్యో ఇప్పుడు ఆదికి దెబ్బ తగిలింది.. ఇప్పుడు వాడిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి.. ఇప్పుడు ఒకటి అర్జెంట్ పని ఉంది.. ఇన్కమ్ టాక్స్ రైడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం డబ్బు బంగారం మా ఫ్రెండ్ ఇంట్లో దాచాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు ఈ బ్యాగ్ ఎవరు తీసుకొని వెళతారని ప్రతాప్ టెన్షన్ పడినట్లు యాక్టింగ్ చేస్తుంటే మన అల్లుడు గారు ఉన్నాడు కదా అని లలిత అంటుంది. అల్లుడు గారు మీరు వెళ్లి ఈ బ్యాగ్ నా ఫ్రెండ్ ఇంట్లో ఇవ్వండి అంటాడు. ఇదేదో తేడా గా ఉందని చక్రికి డౌట్ వస్తుంది. నేను వెళ్ళను సర్ అని చక్రి అంటాడు. పాపం నాన్న అంతలా అంటున్నాడు కదా వెళ్లొచ్చు కదా అని మహా అనగానే చక్రి ఒప్పుకుంటాడు.


ఆ తర్వాత చక్రి బ్యాగ్ తీసుకొని వెళ్తాడు. కార్ లో చక్రి వెళ్తు.. ఇదేదో ఖచ్చితంగా ప్లాన్ అయి ఉంటుంది అనుకుంటూనే వెళ్తాడు.‌ దారిలో ఒకమ్మాయి కార్ కి ఎదురుగా వచ్చి పడిపోతుంది. అయ్యో ఏమైందని చక్రి కార్ దిగుతాడు. వెంటనే ఆ అమ్మాయి చక్రి గొంతు దగ్గర కత్తి పెడుతుంది. కొంతమంది రౌడీలు వచ్చి చక్రిని తీసుకొని వెళ్తారు. మరొకవైపు శైలు తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంది. తను వచ్చాక కేశవ గురించి గొప్పగా మాట్లాడుతుంటే కొంపదీసి ప్రేమిస్తున్నావా ఏంటని తను అడుగుతుంది. అదేం లేదు కానీ ఈ గొలుసు అమ్మి డబ్బులు తీసుకొని రా అతనికి ఇవ్వాలి కదా.. మనకి హెల్ప్ చేసిన వాళ్ళ ఋణం ఉంచుకోకుడదని శైలు చెప్తుంది. మరొకవైపు మాధవ తన తోటి మేస్త్రి ఇద్దరు భోజనం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడే మనీషా తన అన్న కోసం క్యారేజ్ తీసుకొని వచ్చి ఇద్దరికి వడ్డిస్తుంది. మాధవ బాక్స్ మనీషా  తింటుంది.ఆ తర్వాత మహా వాళ్ళు రాత్రి భోజనం చేస్తుంటారు. మహాకి ప్రతాప్ ప్రేమగా భోజనం తినిపిస్తాడు. వాళ్ళ ప్రేమ మహా నిజం అనుకొని తను, చక్రి చేసుకున్న పెళ్లి అబద్ధమని చెప్పబోతుంటే అప్పుడే ఆదికి ఫోన్ వస్తే అతను మాట్లాడుకుంటూ వెళ్తాడు. అదేంటి ఇప్పటివరకు నొప్పి అంటూ నడవలేదు కదా అని మహా అడుగుతుంది. అంటే డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు.. అందుకే నడుస్తున్నాడని ప్రతాప్ కవర్ చేస్తాడు. 

ఆ తర్వాత ఇంకా చక్రి వెళ్లలేదట అని ఆది అంటాడు. ఒకసారి ఫోన్ చెయ్ అని ప్రతాప్ అంటాడు. ఫోన్ కలవడం లేదు.. కార్ లో జీపీఎస్ ఉంది కదా అని ట్రేస్ చేస్తాడు‌‌. ఆది చెప్పిన లొకేషన్ కి కాకుండా వేరే చోట ఉన్నట్టు ఉందని.. అక్కడే కార్ ఆగిపోయిందని ఆది అంటాడు. ఇంకా అర్ధం కావడం లేదా డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయినట్లన్నాడని ఆది అనగానే మహా తన అన్నయ్యని తిడుతుంది. తరువాయి భాగంలో చక్రిని కట్టేసి కొడుతున్న వీడియోని ప్రతాప్ వాళ్ళు చూసి నవ్వుకుంటారు. వాడిని మహా దృష్టిలో.. దొంగని చేసి వాడిని లేకుండా చెయ్యాలని లలిత, ప్రతాప్, ఆది అనుకుంటారు. అప్పుడే మహా వస్తుంది. మరొకవైపు నారాయణ వాళ్లకి మహా ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com