.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -281 లో......సూర్య, ఇషికకి కొత్త ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్ చెయ్యడానికి పెద్దసారు చెక్ ఇస్తాడు. ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదించండి అని సూర్య అనగానే పెద్దసారు పక్కకి జరుగుతాడు. పెద్దనాన్నకి కోపంగా ఉన్నట్లుందని ఇషికతో సూర్య అంటాడు. అయితే ఏం చేద్దాం మళ్ళీ చెక్ రిటర్న్ ఇచ్చి మీ అన్నయ్య చెప్పిన చోట సంతకం పెడుతావా అని ఇషిక అనగానే వద్దని సూర్య అంటాడు. తర్వాత కంగ్రాట్స్ ఇషిక అనుకున్నది సాధించావని వీరు అంటాడు. నాకు ఎందుకో భయంగా ఉంది బ్రో.. రుద్ర బావ అది ఫ్రాడ్ అంటున్నాడు.. ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నామని ఇషిక అనగానే నువ్వేం టెన్షన్ పడకు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గానే ఉన్నాయని వీరు అంటాడు.
ఆ తర్వాత ఇషిక వెళ్ళాక పిచ్చి ఇషిక.. రుద్ర అంటుంది నిజమే అది పెద్ద ఫ్రాడ్ అని వీరు నవ్వుకుంటాడు. ఆ తర్వాత గంగని తీసుకొని రుద్ర వాకింగ్ కి వెళ్తాడు. అక్కడికి విశ్వ కూడా వస్తాడు. కంగ్రాట్స్ సర్ మీరు సెలక్షనర్ గా ఎంపిక అయ్యారని రుద్ర అంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు.. నన్ను మాటలతో మంచి చేసి సెలక్ట్ అవ్వాలని వచ్చారా అని విశ్వ అంటాడు. అంత అవసరం నాకు లేదు సర్ నా ట్యాలెంట్ తో నేను వస్తానని గంగ అంటుంది. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి సర్ ఆడపిల్ల వంటింటికి పరిమితం అనుకుంటున్నారు.. నేనే కనుక మీ కూతురు అయితే ఇలాగే చేస్తారా అని గంగ అంటుంది. పెళ్లి చేసి చేతులు దులుపుకుంటానని విశ్వ అంటాడు. నేను నా ట్యాలెంట్ తో గెలుస్తానని విశ్వతో గంగ ఛాలెంజ్ చేస్తుంది. మరొకవైపు రఘురామ్ చిన్నప్పటి ఫోటో పట్టుకొని ప్రస్తుతం ఎలా ఉంటారో బొమ్మ గిస్తాడు అది గంగ బొమ్మ. అప్పుడే వీరు వచ్చి ఆ బొమ్మని లాక్కొని చూసి షాక్ అవుతాడు. ఈ విషయం ఎవరికి చెప్పకండి అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రుద్ర, రంగ బయటకు వస్తారు. అక్కడ వాళ్ళ వంక శకుంతల కోపంగా చూస్తూ వెళ్తుంది. పెద్దమ్మకి నాపై ఇంకా కోపం తగ్గలేదనుకుంటా అని రుద్ర అంటాడు.
అసలు గంగ పేరెంట్స్ ఎక్కడున్నారో మా అత్తయ్య కూతురు ఎక్కడుందో కనిపెట్టాలి.. గంగ మా అత్తయ్య కూతురు అయితే బాగుండు అని రుద్ర అనగానే మీరు మాట వరుసకి అన్నా కూడా అదే నిజం అని మనసులో రంగా అనుకుంటాడు. ఆ తర్వాత వీరు తనకి గంగనే విశ్వ కూతురు అన్న విషయం తెలిసి ఆ విషయం ఇషికకి చెప్పాలని పిలుస్తాడు. గంగ పేరెంట్స్ లక్ష్మి, పైడిరాజు కాదని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
