.webp)
ఢీ షో ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్ గా సాగింది. ఎలిమినేషన్ లో పండు, రాజు, సంకేత్ , జతిన్ , భూమిక ఉన్నారు. ఇందులో రాజు తప్ప అందరూ సేవ్ అయ్యారు. రాజు ఎలిమినేట్ అయ్యాడు అనేసరికి సెట్ మొత్తం ఒక నిశ్శబ్దం ఆవరించినట్టు అయ్యింది. ఆది, హోస్ట్ నందు కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఆది ఎమోషనల్ అవ్వడు అలాంటి ఆది కన్నీళ్లు పెట్టుకున్నాడు" అని చెప్పాడు నందు. తర్వాత ఆది రాజు గురించి చెప్పుకొచ్చాడు. "ఎందుకో తెలీదు మాష్టర్ ఢీలో నాకు రాజు అంటే చాలా ఇష్టం. నేను ఇంటి దగ్గర డాన్స్ రిలేటెడ్ ఏదన్నా చూడాలి అనుకున్నప్పుడు రాజు డాన్స్ వీడియోస్ పాతవైనా కూడా చూస్తూ ఉంటాను. వాడంటే నాకు చాలా ఇష్టం. ఈ లెవెల్ లో వెళ్లాల్సిన వాడు కాదు. చాలా కింది స్థాయి ఎంత కస్టపడి వచ్చాడో నాకు తెలుసు మాష్టర్. ఈసారి కూడా కప్పు రాజుదే అన్న ఫీలింగ్ తోనే ఉన్నారు మాష్టర్ స్టార్టింగ్ నుంచి అందరూ. కాకపొతే మధ్యలో లంగ్స్ ప్రోబ్లం అయ్యింది. ఈటీవీ వాళ్ళ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసి జాను లిరితో పెర్ఫార్మ్ చేస్తూ పడిపోయాడు మాష్టర్. నలుగురు కలిసి రూమ్ కి తీసుకెళ్లారు.
అంత పెయిన్ లో ఉండి కూడా ఆగుతాను అనో తగ్గుతాను అనో అనలేదు టఫ్ ఫైట్ ఇస్తూనే వచ్చాడు. ఎప్పుడూ అంటూ ఉంటాం కదా రాజు గాడు ఫార్మ్ లోకి వస్తే వార్ వన్ సైడ్ అని ఆ మాట నిజం చేసాడు. ఒక ఛాన్స్ అడగాలనుంది మాష్టర్ " అంటూ అడిగాడు. "ఆది గారు అందరినీ నవ్వించే మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలా ఎమోషనల్ గా చూడడం చాల చాల బాధగా ఉంది మీ గురించి కాదు రాజు గురించి ఫస్ట్ టైం ఒక రిక్వెస్ట్ అడిగారు. ఇది ఫార్మాట్ కాబట్టి తప్పదు ఫ్యూచర్ లో ఏమన్నా జరిగితే తప్ప ఏమీ చేయలేము సారీ ఆది గారు " అని చెప్పారు విజయ్ బిన్నీ మాష్టర్.




.webp)
