Home

»

Tv News

Podharillu :  చక్రి కోసం టవల్ తెచ్చిన మహాలక్ష్మి.. నిజం చెప్పేందుకు సిద్ధమైన కూతురు!

May 29, 2026 10:09AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -124 లో.....మాధవ వాళ్ళతో మహా వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇక వెళ్లి పడుకుందాం రండి అని మహా అనగానే చక్రి ఆశ్చర్యంగా మీరు బానే ఉన్నారా అని అడుగుతాడు. నీతో రూమ్ షేర్ చేసుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఇప్పుడు తప్పదు.. మా వాళ్ళు అందరు మనం భార్యాభర్తలమని అనుకుంటున్నారు కదా.. అందుకే అని మహా అంటుంది. ఆ తర్వాత లలిత స్వీట్ చేసి ప్రతాప్, ఆదికి ఇస్తుంది. కూతురు రాగానే మమ్మీకి రెక్కలు వచ్చాయని ఆది అంటాడు. అప్పుడే చక్రి వస్తాడు.

ఇప్పుడు అల్లుడు గారు ఎక్కడ పడుకుంటారని ప్రతాప్ అంటాడు. ఎక్కడ ఏంటి నాన్న.. డ్రైవర్ ఎక్కడ పడుకుంటాడు కార్ షెడ్ లో పడుకుంటాడని ఆది అంటాడు. ఏం బామ్మర్ది నీకు మర్యాద లేదు.. ఏం లేదు.. బావని ఎలా చూసుకోవాలో తెలియదా బద్మాష్.. ఇప్పుడు వెళ్లి మహా గదిలో తన బెడ్ పై పడుకుంటాను.. ఏం చేసుకుంటావో చేసుకోమని చక్రి అంటాడు. ఒరేయ్ నీ సంగతి చెప్తానని ఆది అంటాడు. అప్పుడే మహా వస్తుంది. మహా నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్లి పడుకుంటానని చెప్పి చక్రి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహా కూడా వెళ్తుంది. చక్రికి కింద నేలపై చాప వేస్తుంది మహా‌. తర్వాత మహా బెడ్ పై పడుకుంటుంది. మీరు నేను ఒకే గదిలో పడుకుంటున్నాం కదా.. ఏం భయం లేదా అని చక్రి అడుగుతాడు‌. ఎందుకు భయం మీపై నమ్మకం ఉందని మహా అంటుంది. మరుసటిరోజు మహా లేచి కిందకి వస్తుంది. మహా నుదుటిపై ఉన్న తన స్టికర్ పక్కకి వెళ్తుంది. అది చూసిన వాళ్ళు చిరాకుగా ఏదో జరిగిందని అనుకుంటారు. లలిత తన స్టికర్ సరిచేస్తుంది. ఆయనకి ప్రొద్దున లేస్తే టీ తాగడం అలవాటు అని మహా టీ తీసుకొని వెళ్లి చక్రికి ఇస్తుంది. మళ్ళీ మహా కిందకి వస్తుంది.

నువ్వు వాడికి సేవ చెయ్యడం నచ్చడం లేదు.. నువ్వేంటి నీ స్థాయి ఏంటని మహాతో లలిత అంటుంది. ఆది, ప్రతాప్ ఇద్దరు చక్రి ఫ్యామిలీ గురించి  తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి అని మహా కోప్పడుతుంది. ఆ తర్వాత చక్రి స్నానానికి వెళ్తుంటే మహా తనకి టవల్ ఇస్తుంది‌‌. దాంతో చక్రి మురిసిపోతాడు. తరువాయి భాగంలో మహా వాళ్ళ నాన్న ప్రతాప్ , అన్న ఆది వాళ్ళకి నేను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదని చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com