Home

»

Tv News

హరికి దివి మాస్ అవమానం!

May 27, 2026 3:22PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో చూస్తే  ఫుల్ జోష్ వస్తుంది అంత కలర్ ఫుల్ గా ఉంది . ఇక ఈ ఎపిసోడ్ బాచిలర్స్ పార్టీగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇంతలో నిఖిల్ విజయేంద్ర సింహాని చూసిన శ్రీముఖి "నాకెందుకో వీడు టక్కున లేచిపోయి పెళ్లి చేసుకుంటాడనిపిస్తోంది" అనేసింది. వెంటనే పక్కనే ఉన్న అవినాష్ శ్రీముఖికి కౌంటర్ ఇచ్చాడు. "వాడన్నా లేచిపోయి చేసుకుంటాడు మీరు ఇక్కడున్న చేసుకోవట్లేదు కదా" అన్నాడు.

దాంతో శ్రీముఖి సీరియస్ గా చూసింది. ఇంతలో దీపికా వచ్చి "బాచిలర్ కాదు మాష్టర్స్ చేసి పిహెచ్ డినే కంప్లీట్ చేసాను" అంది. వెంటనే హరి వచ్చి "ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నందుకే బాచిలర్ గా ఉండిపోయావ్" అనేశాడు. ఇక ఈ ఎపిసోడ్ కి దివి వచ్చింది. ఇక శ్రీముఖి హరిని చూపిస్తూ "అలాంటి అబ్బాయి వస్తే " అని అడిగింది. "అలాంటి అబ్బాయి వస్తే సింగల్ గా ఉండిపోతాను " అనేసి అవమానించింది. "ఒక్క నిమిషం ఇక్కడ అవమానించారు " అన్నాడు హరి. "నువ్వు జేబులో చెయ్యి పెట్టుకుని గోక్కుంటే అనరారా" అంటూ శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. ఇక ee ఎపిసోడ్ కి నిఖిల్ విజయేంద్ర సింహ, నిఖిల్ మలయక్కల్, పండు, బాలు, డాక్టర్ గౌతమ్ కృష్ణ వచ్చారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com