
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -228 లో.... తనకి మనవడినో మనవరాలినో ఇవ్వాలని లేకపోతే డైవర్స్ కన్ఫమ్ అని ఇషికని ఇందుమతి డిమాండ్ చేస్తుంది. దానికి ఇషిక ఒప్పుకోదు.. మా అమ్మ అన్నదాంట్లో తప్పేముంది.. భార్య ఫార్మాలిటిగా ఉంటే వద్దని సూర్య కోపంగా అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూడు నీకు మూడు నెలలు టైమ్ ఇస్తున్నాను.. నాకు గుడ్ న్యూస్ చెప్పాలి లేదంటే.. నా కొడుకుకి వేరొక పెళ్లి చేస్తాననే న్యూస్ నీకు చెప్పాల్సి వస్తుందని ఇషికకి ఇందుమతి చెప్తుంది. నేను పిల్లలని కనడం ఏంటని ఇషిక అనుకుంటుంది. అసలు ఈవిడకి ఇలాంటి ఐడియాలు ఎవరిస్తున్నారని ఇషిక అనుకుంటుంది.
మరుసటిరోజు రుద్ర ఒక్కడే చెస్ ఆడుకుంటాడు. అప్పుడే వీరు వస్తాడు. ఏంటి బావ ఒక్కడివే ఆడుకుంటున్నావని అంటాడు. నా ముందు శత్రువు ఉన్నాడని ఉహించుకొని ఆడుతున్నానని రుద్ర అంటాడు. నేను ఆడుతాను బావ అని ఆట మొదలుపెడతాడు వీరు. అప్పుడే పెద్దసారు వస్తాడు. బావ బామ్మర్ది ఇద్దరు ఆడుతున్నారు.. రుద్ర బాగా ఆడుతాడు కాబట్టి నేను వీరుకి సపోర్ట్ చేస్తానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఆటమధ్యలో రుద్ర మాట్లాడుతాడు. పెద్దనాన్న నీకు నాగభూషణం తెలుసా అని అడుగగా వీరు షాక్ అవుతాడు. వాడి గురించి ఎందుకు.. వాడు పెద్ద మోసగాడు.. స్నేహం పేరుతో నన్ను మోసం చేశాడు.. ప్రజల డబ్బు కాజేయాలని చూశాడు.. అందుకే వాడిని స్టేషన్ లో అప్పగించాను.. ఆ తర్వాత వాడి గురించి గాని వాడి కుటుంబం గురించి గానీ ఏం తెలియదని పెద్దసారు అనగానే వీరుకి కోపం వస్తుంది.. అయిన ఇప్పుడు ఎందుకు అడిగావని పెద్దసారు అంటాడు. ప్రొద్దున సుబ్బారావు గారు వచ్చారు. పాత విషయాలు చెప్తూ టాపిక్ వచ్చిందని రుద్ర అంటాడు. ఆ తర్వాత చెస్ లో వీరుకి రుద్ర చెక్ పెడతాడు. నిన్ను ఎవరు ఓడించలేరు రుద్ర అని పెద్దసారు అంటాడు.
మరొకవైపు కావాలనే కార్తీక్ ని సూపర్ మార్కెట్ కి రప్పించి రుద్ర జాబ్ ఇస్తాడు. ప్రమీల, కార్తీక్ లని దగ్గర చెయ్యడం కోసం ప్రమీల కార్తీక్, మక్కమ్ మీరు ముగ్గురు డిస్కషన్ చేసుకొని సేల్స్ ఎలా పెంచాలో చూడమని రుద్ర చెప్తాడు. మరొకవైపు వీరు, ఇషిక బయటకు వెళ్తారు. వీరు ఫ్రస్ట్రేషన్ తో ఆ రుద్రకి నా గురించి తెలిసిపోయిందని ఇషిక తో అంటాడు. ఆ తర్వాత పెద్దసారు దగ్గరికి కొంతమంది వచ్చి శ్రీరామనవమి మీ చేతులు మీదుగా చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తారు. తరువాయి భాగంలో పెద్దసారుని చంపడానికి వీరు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






