
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-629లో.. దశరథ్ , శివన్నారాయణ, పారిజాతం, జ్యోత్స్న, దీప, శ్రీధర్, కార్తీక్, లాయర్ అంతా కలిసి హాల్లో మాట్లాడుకుంటారు. లాయర్ గారు మీరు వెళ్ళండి.. తరవాత మీకు కబురు చేస్తానని శివన్నారాయణ అనగానే లేదు తాత లాయర్ ఉండాలి.. మేనల్లుడికి ఆస్తులు ఎలా చెందుతాయని రాస్తారని జ్యోత్స్న అనగానే నడ కూతురికి, తన పిల్లలకి చెందాలని రాసాను నువ్వే కదా నా కూతురు.. నువ్వు నా కూతురు కాదా ఏంటని దశరథ్ అంటాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావని శివన్నారాయణ అంటాడు. మంచి ప్లాన్ వేశారు.. ఆస్తి మొత్తం కాజేయడానికి భళే ప్లాన్ చేశారురా అని పారిజాతం అంటుంది.
మరోవైపు జ్యోత్స్న అగ్రిమెంట్ గురించి మాట్లాడుతుంది. బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నానని జ్యోత్స్న అంటుంది. అసలు అగ్రిమెంట్ కి వీలునామాకి సంబంధం ఏంటని దశరథ్ అడుగుతాడు. మేనల్లుడు కార్తీక్ కి రావాలని ఎందుకు రాశావో చెప్పమని జ్యోత్స్న అంటుంది. కార్తీక్, శ్రీధర్, కాంచన ఆస్తి కోసమే ఇలా ప్లాన్ చేశారని పారిజాతం తిడుతుంది. దాంతో మాకేం సంబంధం లేదని కార్తీక్ అంటాడు. అప్పుడే సుమిత్ర వచ్చి వీలునామా గురించి తనకి చెప్పాడని చెప్తుంది. అదేంటి మమ్మీ అని జ్యోత్స్న అనగానే నీ పెళ్ళి చూడాలని, నీకు పిల్లలు పుడితే వారితో ఆడుకోవాలని మాకు కలలుంటాయి. ఇంకెప్పుడు పెళ్ళి చేసుకుంటావ్.. ఈ ఏడాదిలో పెళ్ళి చేసుకొని మనవడినో మనవరాలినో ఇవ్వాలని సుమిత్ర అనగానే దీనికి నేను అంగీకరిస్తున్నానని శివన్నారాయణ అంటాడు. ఇక ఆ తర్వాత శ్రీధర్, కాంచన, కార్తీక్ వెళ్లిపోతారు.
మరోవైపు స్వప్న వాళ్ళ ఇంటికి దాస్ కొత్త పెళ్ళికొడుకుని తోసుకొని వస్తాడు. ఇతని పేరు వసంత్ అని కావేరికి దాస్ పరిచయం చేస్తాడు. ఇక అతను రాగానే స్వప్నని తీసుకుని రమ్మని చెప్తాడు. కాసేపటికి స్వప్న వస్తుంది. లేట్ అవుతుంటే పూలు, చీరతో రెడీ అవుతున్నావేమోనని అనుకున్నానని దాస్ అనగానే పూలు చూడటం కోసం వచ్చాడా.. నన్ను చూడటం కోసం వచ్చాడా అని స్వప్న అంటుంది. ఐ లైక్ యువర్ థాట్ అని వసంత్ అంటాడు. మాకు డైవర్స్ అయినప్పటికీ మళ్ళీ కలుస్తామేమోననే నమ్మకం నాకుంది..కానీ ఈ పెళ్ళి వద్దు అని కాశీ అనగానే నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని స్వప్న చెప్తుంది. దాంతో కాశీ డిస్సప్పాయింట్ అవుతాడు. ఇక అందరికి బై చెప్పేసి వసంత్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






