Home

»

Tv News

Podharillu :కేశవ సీక్రెట్ లీక్..నారాయణను హత్య చేయబోతున్న ఆది!

Mar 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -80 లో..... కేశవని మహా, కన్నా ఏడిపిస్తారు. అందరు పడుకున్నాక బుస్సు బుస్సు అంటూ కన్నా అంటాడు. అసలు ఈ బుస్సు గోల ఏంట్రా అని మాధవ అడుగుతాడు. మీ తమ్ముడి లవర్ అని మహా అంటుంది. అయ్యో అది లవర్ కాదు.. నాకున్నా ఏకైక శత్రువు అని కేశవ జరిగింది మొత్తం చెప్తాడు. నమ్మొచ్చా అని మాధవ అంటాడు. అన్నయ్య నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అని కేశవ అంటాడు. సర్లే అని మాధవ అనగానే నాకు డౌటే అని మహా అంటుంది.

మరుసటిరోజు మహా తన కాలేజీకీ వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఒక్కదానివే వెళ్తే ప్రాబ్లమ్ అవుతుంది అమ్మ అని మహాతో మాధవ అంటాడు. మా వాళ్ళు అంతే చిన్నప్పటి నుండి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెంచారు.. ఇప్పుడు మీరు ఇలా అని మహా అనగానే సరే అమ్మ నీ ఇష్టమని మాధవ అంటాడు. మాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కానీ మిమ్మల్ని అలా చూసుకుంటున్నామని కేశవ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత మహా వెళ్ళడానికి చక్రి తన ఓనర్ తో మాట్లాడి కార్ తెప్పిస్తాడు. కార్ లో మహా ఒక్కతే వెళ్తుంటే అందరు అన్ని జాగ్రత్తలు చెప్తారు. అదంతా నారాయణ విని త్వరగా అక్కడ నుండి వెళ్తాడు.

మహా బయల్దేరాక నారాయణ కార్ కి అడ్డువచ్చి కార్ ఆపమని డ్రైవర్ ని బెదిరిస్తాడు. కార్ ఎక్కి మహాకి తోడుగా వెళ్తాడు. మహా ఇబ్బందిగా ఫీల్ అవుతూ.. మాధవకి ఫోన్ చేసి మీ నాన్న నాతో వస్తున్నారని చెప్తుంది. తరువాయి భాగంలో మహా కాలేజీకి వచ్చిన విషయం ఆదికి తెలిసి తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. నారాయణని ఆది కత్తితో పొడుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com