Home

»

Tv News

Jayam Serial: పెద్దసారు గురించి రుద్ర దిగులు.. పైడిరాజుని నిలదీసిన విశ్వ!

Nov 19, 2026 8:21AM

 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 430 లో..... ఇషిక, వీరు అన్న మాటలకి పెద్దసారు హర్ట్ అవుతాడు. ఇంట్లో అందరూ బానే ఉన్నా వాళ్ళ మనసులో వేరే ఆలోచన ఉందని పెద్దసారు అనగానే ఏంటని శకుంతల అడుగుతుంది.ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదని పెద్దసారు అంటాడు. మరోవైపు రుద్ర వాళ్ళు ఇంటికి రాగానే డాక్టర్ బయటకు వస్తాడు. ఏమైందని రుద్ర అడుగుతుంది. మీ పెద్దనాన్నకి బాలేదని డాక్టర్ చెప్పగానే రుద్ర లోపలికి వెళ్లబోతుంటే వీరు ఆపుతాడు.

 

ఏంటి బావ మేనమామ దోషం మర్చిపోయావా అని అంటాడు.. నేను ఇంట్లో లేకుండా చూసి ఏదో కుట్ర చేస్తున్నావని రుద్ర అంటాడు. మీరు ఏం టెన్షన్ పడకండి సర్ మేం లోపలికి వెళ్తామని గంగ, రంగా వెళ్తారు. పెద్దసారు దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు. గంగని చూసాక మనసు ప్రశాంతంగా ఉందని పెద్దసారు అంటాడు. రుద్ర కిటికీ దగ్గరికి వచ్చి పెద్దసారుతో మాట్లాడుతాడు. మరోవైపు విశ్వ ఇంటికి వెళ్తాడు. కాఫీ తీసుకొని రావాలా అని విశ్వని సుధా అడుగుతుంది. లచ్చమ్మ, పైడిరాజుని పిలవమని విశ్వ చెప్తాడు. వాళ్ళు రాగానే అసలు గంగ మీ కూతురేనా అని అడుగుతాడు. దాంతో వాళ్ళు షాక్ అవుతారు. తను గొప్పింట్లో పుట్టాల్సిన బిడ్డ అని అకాడమీలో జరిగింది మొత్తం చెప్తాడు.

 

అప్పుడే గంగ మీ కూతురే అని చెప్పాలని పైడిరాజు వాళ్ళు అనుకుంటారు‌ ఆలోపే జయ వచ్చి డైవర్ట్ చేస్తుంది. మరోవైపు పెద్దసారు గురించి రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు. తనని డైవర్ట్ చేయడానికి గంగ, రంగా ట్రై చేస్తారు. మీరు ఏం టెన్షన్ పడకండి సర్.. ఆ ఇంట్లో ఏం జరిగినా మేం చెప్తామని గంగ, రంగా అంటారు. అప్పుడే బాబు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో వెళ్లి చూడమని రుద్ర అనగానే గంగ వెళ్తుంది. ఎవరు ఎత్తుకున్నా బాబు ఏడుస్తూనే ఉంటాడు‌. గంగ వచ్చి బాబుని ఎత్తుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

SEO keywords:

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com