Home

»

Tv News

Bigg Boss 10 Telugu: టాప్‌ ఓటింగ్ తో త్రిగుణ్ ఫస్ట్.. డేంజర్‌లో నీతూ, శివ్!

Nov 19, 2026 8:18AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 11వ వారం ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. నామినేషన్స్‌లో ఉన్న 11 మందిలో త్రిగుణ్ అందరికంటే ముందున్నాడు.

లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం త్రిగుణ్ - 32.56% (41,212 ఓట్లు) తో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ముకేష్ - 28.52% (36,106 ఓట్లు) తో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరికీ మిగిలిన వారితో పోలిస్తే భారీ ఓట్లు పడుతున్నాయి.ఇక మూడో స్థానంలో అమన్ - 8.44% (10,687 ఓట్లు), నాలుగో స్థానంలో దేబ్జానీ - 7.02% (8,882 ఓట్లు) ఉన్నారు.బాటమ్‌లో మాత్రం పరిస్థితి చాలా టైట్‌గా ఉంది. రామకృష్ణ - 4.2% (5,313 ఓట్లు), వర్షిణి - 4.17% (5,276 ఓట్లు), వంశీ - 3.98% (5,032 ఓట్లు), సుధీర్ - 3.93% (4,981 ఓట్లు), రామ్ ప్రసాద్ - 3.9% (4,937 ఓట్లు) తో ఒకరి వెనుక ఒకరు ఉన్నారు.

అత్యంత డేంజర్ జోన్‌లో శివ్ - 1.69% (2,142 ఓట్లు), నీతూ - 1.59% (2,014 ఓట్లు) ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తే ఈ వారం నీతూ లేదా శివ్‌లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.అయితే ఇది అనధికారిక ఆన్‌లైన్ ఓటింగ్ మాత్రమే. అసలు ఫలితం వీకెండ్‌లో నాగార్జున చెప్పే వరకు వేచి చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com