Home

»

Tv News

Ye Devi Varamo Neevu : రాజారావు మాస్టర్ ప్లాన్..రౌడీల బారి నుంచి ప్రీతిని కాపాడిన అంజలి!

Aug 5, 2026 9:58AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -26 లో..... అంజలి, రాజారావు ఇద్దరు షాపింగ్ కి వెళ్తారు. వాళ్ళని వెతుక్కుంటూ మనీష్ కూడా వెళ్తాడు. తాతయ్య మీరు ఎందుకు షాపింగ్ కి వచ్చారని మనీష్ తనని పక్కకి తీసుకొని వెళ్తాడు. రేపు తన బర్త్ డే రా అని రాజారావు చెప్తాడు . యితే అడ్వాన్స్ విషెస్ చెప్తానని వెళ్తుంటే తనకి సర్ ప్రైజ్ ఇస్తున్నాను.. అసలు రేపు తన పుట్టినరోజు అని తనకి కూడా తెలియదని రాజారావు అనగానే తనకే తెలియకపోతే మీకెలా తెలిస్తుందని మనీష్ అడుగుతాడు.

అదంతా తర్వాత చెప్తానని రాజారావు అంటాడు. అప్పుడే అంజలి పిలుస్తుందని రాజారావు వెళ్తాడు. ఆ తర్వాత శివశంకర్ , కమల రావడంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళని చూసి మనీష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రాజారావు అంజలిని తీసుకొని ఇంటికి వస్తాడు. శంకర్ ని చూసి పెద్దాయన షాక్ అవుతాడు. ఈ అమ్మాయి ఎవరని అడుగుతాడు. తెలిసిన వాళ్ళ అమ్మాయి ఏదో పని ఉండి ఇక్కడికి వచ్చింది.. పని అయ్యేవరకు మా ఇంట్లో ఉండి మీ అమ్మని చూసుకోమని చెప్పానని పెద్దాయన అంటాడు. అవునురా ఆ అమ్మాయి చాలా బాగా చూసుకుంటుందని రత్నం చెప్పగానే ఎప్పుడు అలాగే చూసుకోండి అని శంకర్ చెప్తాడు. ఆ తర్వాత అంజలి దగ్గరికి రాకి వచ్చి నీకు షార్ట్ ఫిల్మ్ లో ఛాన్స్ వచ్చిందని చెప్తాడు. నాకు అవసరం లేదని అంజలి చెప్తుంది. ఏం చేసినా పడట్లేదని రాకీ డిస్సపాయింట్ అవుతాడు.

ఆ తర్వాత ఇప్పుడు శంకర్ కి అంజలి గురించి చెప్తే చేసిన పాపం పోతుంది. తప్పు సరిదిద్దుకొని తల్లి కూతుళ్ళని ఒకటి చేస్తాడని రాజారావు అనుకొని శంకర్ దగ్గరికి వచ్చి నీ చెల్లి పెళ్లి ముందు రోజు సంఘటన గుర్తుందా అని అనగానే శంకర్ కోపంతో ఊగిపోతాడు. తరువాయి భాగంలో ప్రీతీని కొంతమంది రౌడీలు ట్యూషన్ నుంచి వస్తుంటే ఏడిపిస్తారు. అంజలి సేఫ్ గా తనని ఇంటికి తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com