Home

»

Tv News

Jayam serial: పెద్దసారు ఇంట్లో జయ నిశ్చితార్థ వేడుక.. రుద్ర వేస్తున్న కొత్త ప్లాన్ ఏంటి!

Jul 30, 2026 9:51AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-333లో.. విశ్వ, సుధాల కూతురు జయ నిశ్చితార్థం పెద్దసారు వాళ్ళ ఇంట్లో జరిపించడానికి విశ్వ ఒప్పుకుంటాడు. మరోవైపు వీరు నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తుంటాడు. అప్పుడే వీరు దగ్గరికి రంగా వస్తాడు. ఏంటి నీకు కుళ్ళు మొదలయిందా అని రంగాని వీరు అంటాడు. అదేం లేదని రంగా అంటాడు. మీ హీరో ఎక్కడ అనగానే అప్పుడే రుద్ర అక్కడికి వస్తాడు. నా ప్రయత్నం ద్వారా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందని , నా ప్రయత్నం ద్వారా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని, నా ప్రయత్నం ద్వారా అత్తయ్య ఈ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిపించడానికి ఒప్పుకుందని వీరు అంటాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్ వీరు కానీ ఫలితం ఆశించకు అని రుద్ర అంటాడు.

నువ్వు చేసేది మంచి అయితే ఎవరు ఆపినా ఆగదు.. అదే నీ ప్రయత్నంలో ఎవరికైనా కీడు జరిగితే నేను చూస్తూ ఊరుకోలేనని రుద్ర అనగానే వీరి షాక్ అవుతాడు. ఆ తర్వాత రుద్ర, రంగా అక్కడి నుండి వెళ్తారు. రుద్ర ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు మనం జాగ్రత్తగా ఉండాలని వీరు అనుకుంటాడు. మరోవైపు విశ్వ, జయ, సుధా, పైడిరాజు, లక్ష్మీ ఇంటి నుండి బయల్దేరతారు. నా మనసు ఎందుకో ఆందోళనగా ఉంది లచ్చమ్మ అని సుధా అంటుంది. మీరేం టెన్షన్ పడకండి అమ్మ అంతా మంచే జరుగుతుందని లక్ష్మీ అంటుంది. ఇక అందరు బయల్దేరి పెద్దసారు వాళ్ళ ఇంటికి వెళ్తారు.  దారిలో ఒక షాప్ దగ్గర విశ్వ, సుధా, జయ ఆగుతారు. అదే సమయంలో పెన్సిల్ ఆర్టిస్ట్ ఒకతను వాళ్ళని చూస్తాడు. ఇతని కూతురు ఫోటో వేయమని చెప్తే వేశాను కానీ వీరుకి బయపడి వేయలేదని చెప్పానని అనుకుంటాడు. అప్పుడే జయని చూసి నేను గీసింది ఈ అమ్మాయి ఫోటో కాదు కదా.. గుడిలో కన్పించిన అమ్మాయి కదా అని అతను అనుకుంటాడు. ఆ విషయం చెప్పాలని అతను విశ్వ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళు అప్పటికే బయల్దేరి వెళ్తారు‌. ఇక తన ఇంటికి వెళ్ళి గంగ డ్రాయింగ్ ని తీసుకొని తన అసిస్టెంట్ తో కలిసి విశ్వ ఇంటికి బయల్దేరి వెళ్తారు. మరోవైపు గంగకి కొత్తచీర కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతుంది. అప్పుడే రుద్ర తన దగ్గరికి వస్తాడు. ఏంటి ఇంకా రెడీ కాలేదా అని రుద్ర తిడతాడు. 

ఈ పట్టుచీర సెట్ అవ్వడం లేదని గంగ అంటుంది. దాంతో రుద్ర చీరని కడతాడు. అప్పుడే రంగా వచ్చి వెటకారం ఆడితే అతని చెంపచెల్లుమనిపిస్తాడు రుద్ర. ఇక గంగ, రంగాలని రుద్ర తిట్టేసి వెళ్తాడు. ఇక ఇంట్లో ఫంక్షన్ కాబట్టి వీరు పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. అప్పుడే ప్రీతి వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని వీరు అనగానే తన మేనత్త కూతిరి ఎంగేజ్మెంట్ కళ్ళారా చూడాలని వచ్చిందని అక్కడే ఉన్న శకుంతల చెప్తుంది. సరే అయితే జాగ్రత్తగా ఉండమని వీరు చెప్తాడు. నేను క్యాటరింగ్ వాళ్ళకి చెప్పి వస్తానని శకుంతలతో వీరు చెప్పి వెళ్తాడు. అన్ని పనులు వీరు దగ్గరుండి చేసుకుంటున్నాడని శకుంతల అనుకుంటుంది. మరోవైపు విశ్వ వాళ్ళు కార్ దిగి వస్తారు. వాళ్ళని పెద్దసారు ఫ్యామిలీ రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com