Home

»

Tv News

Godhavari : సింహాద్రి మోసం బట్టబయలు.. నందు ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్!

Jul 30, 2026 9:53AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -69 లో.....జాను, సూర్య కలిసి వీరబాబు దగ్గరికి వెళ్తారు. తోట గురించి చెప్పమని రిక్వెస్ట్ చేస్తారు. నేను చెప్పినట్లు తనకి తెలిస్తే చంపేస్తాడని వీరబాబు చెప్తాడు. నువ్వు చెప్పినట్లు మేం  చెప్పమని జాను అనగానే వీరబాబు చెప్తాడు. తోటని ఫార్మా కంపెనీకి అమ్ముతున్నారని చెప్తాడు. ఆ తర్వాత తోట అమ్మిన అతని కొడుకు దగ్గరికి వెళ్తే అసలు నిజం తెలుస్తుందని జాను అంటుంది. మరొకవైపు రిజిస్ట్రేషన్ కి అన్ని ఏర్పాట్లు చేసావా అని కళ్యాణ్ ని సింహాద్రి అడుగుతాడు. చెల్లిని తీసుకొని రావడానికి కార్ పంపావా అని సింహాద్రి అడుగగా పంపించానని కళ్యాణ్ చెప్తాడు

మరొకవైపు నందుకి ఎలా దగ్గర కావాలో మురళికి పెద్దావిడ చెప్తుంది. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటే నందుతో మురళి మాట్లాడాలని ట్రై చేస్తాడు. తన కోసం చాక్లెట్ తీసుకొని వస్తాడు. ఆ చాక్లెట్ చూసి నాకు కావాలంటూ గౌతమి, కిన్నెర తీసుకుంటారు. ఆ తర్వాత తోట అమ్మిన అతని దగ్గరికి జానూ సూర్య వెళ్లేసరికి ఇంటికి తాళం ఉంటుంది. పక్కన ఉన్న అతను పక్క ఊరికి వెళ్లారని చెప్తాడు. తర్వాత మురళికి జాను ఫోన్ చేసి బావ నువ్వు అందరిని తీసుకొని తోట దగ్గరికి వెళ్ళమని చెప్తుంది.

ఆ తర్వాత తోట సింహాద్రి ఫార్మా కంపెనీ వాళ్ళకి అమ్ముతాడు. రిజిస్ట్రేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. వాళ్ళు వచ్చి సంతకాలు చేస్తుంటే అప్పుడే నందు ఆగమని చెప్తుంది. బాగా మోసం చేస్తున్నావ్ సింహాద్రి అని నందు అనగానే ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావని సింహాద్రి అనగానే మోసగాడా అని పిల్వమంటావా అని నందు అంటుంది. మొన్న నువ్వు పెళ్లి చేసింది తనకే కదా అని భువన అనగానే అవును ఎలా మాట్లాడుతుందో చూడమని సింహాద్రి యాక్టింగ్ చేస్తాడు. తరువాయి భాగంలో సింహాద్రి చెంపచెల్లుమనిపిస్తుంది శారద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com