
కుకు విత్ జాతిరత్నాలు షో లేటెస్ట్ ప్రోమో అదిరిపోయింది. ఫ్రెండ్ షిప్ థీమ్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇటీవలి కాలంలో చాలా షోస్ ఎండ్ ఐపోతున్నాయి. రీసెంట్ ఢీ డాన్స్ షో సీజన్ 20 పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ కుకింగ్ షో కూడా గ్రాండ్ ఫినాలేకి దగ్గర పడిపోయింది. ఇక లేటెస్ట్ ప్రోమోలో కుక్కులు, జాతిరత్నాలు చేసిన అల్లరి బాగుంది. ఈ ఎపిసోడ్ కి జాతిరత్నాలు ఫ్రెండ్స్ వచ్చారు. పొదరిల్లు మహా కోసం చక్రి, తనూజ కోసం నీతూ నటరాజ్ వచ్చింది. అన్షు , పంచ్ ప్రసాద్, నీతూ నటరాజ్, దివ్య, మోనిష వంటి వాళ్లంతా వచ్చారు.
"లైఫ్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ తనూ లాంటి ఫ్రెండ్ ఉండడం అదృష్టం " అని చెప్పింది నీతూ నటరాజ్. తర్వాత పంచ్ ప్రసాద్ "నేను ఫ్రెండ్ ని కాదు బెస్ట్ ఫ్రెండ్ ని. మా రాకేష్ లో గొప్పతనం ఏంటంటే అన్ని వాయిస్ లు చేస్తాడు ఏది పర్ఫెక్ట్ గా చేయడు" అని రాకేష్ పరువు తీసేసాడు. ఇక అవినాష్ ఐతే "స్నేహం కోసం" మూవీలో చిరంజీవి గెటప్ తో వచ్చాడు. ఇక ఆషికాను చూసాక "నిజంగా ఈవిడను చూస్తుంటే మా ఆవిడే గుర్తొస్తోంది " అన్నాడు. దాంతో ఆషిక చిరాగ్గా మొహం పెట్టింది. ఇక రోహిణి లంగాఓణిలో వచ్చి "నేను ఎవరితో ఉంటే వాళ్ళు పోతున్నారు" అనేసరికి తనూజ ఏడుపు మొహం పెట్టింది. "బేసిక్ గా కుకులను నమ్ముకుంటే ఎలిమినేట్ ఐపోతున్నారు. మనిద్దరం ఫ్రెండ్ షిప్ చేద్దామా " అంటూ యాంకర్ ప్రదీప్ కె ఎసరు పెట్టింది. దాంతో ప్రదీప్ వద్దో వద్దో అంటూ గట్టిగా అరిచాడు. ఒకవేళ ఫ్రెండ్ షిప్ చేస్తే ఎక్కడ తన యాంకర్ పదవి పోతుందో అని.
తర్వాత మణికంఠ ఆర్య గెటప్ వేసుకొచ్చాడు. నూకరాజు ఆర్ ఆర్ ఆర్ గెటప్ తో వచ్చాడు. ఇక ఫ్రెండ్స్ వచ్చి స్పిన్ వీల్ తిప్పడం ఎవరి పేరు మీద ఆగుతుందో వాళ్ళు అక్కడ కొన్ని జ్యూస్ షాట్స్ తాగి వాటి టేస్ట్ తెలుసుకుని వాటిని దేంతో తయారు చేశారు ఆ వస్తువుల్ని గుర్తుపట్టడం వంటి టాస్కులు ఇచ్చారు. ఇక నెటిజన్స్ ఐతే అన్ని కామెంట్స్ లో తనూజా నీతూ సూపర్ అంటూ విషెస్ చెప్పారు.




.webp)
.webp)
