Home

»

Tv News

Jayam serial : క్యాన్సిల్ అయిన పెళ్లి సంబంధం.. రంగంలోకి దిగిన వీరు, రుద్ర!

Jul 28, 2026 10:07AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -331 లో.....జయకి వచ్చిన సంబంధం పెద్ద ఫ్యామిలీ కాదని క్యాన్సిల్ అయింది. దాంతో వీరు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. విజయంద్ర ప్రతాప్ కుటుంబం విశ్వనాథ్ కుటుంబం కలిసి జయ పెళ్లి చెయ్యాలని విశ్వనాథ్ తో వీరు చెప్తాడు. ఏం అంటావ్ బావ మీరు కూడా ఇదే చెప్పాలనుకున్నారు కదా అని రుద్రతో వీరు అంటాడు.

అవును మావయ్య.. వీరు బాగా అలోచించి చెప్తాడు. మీరు ఒప్పుకుంటే పెద్దమ్మని చాలా ఈజీగా ఒప్పిస్తాడని రుద్ర అనగానే విశ్వనాథ్ సరే అంటాడు. ఆ తర్వాత ఎందుకు వీరు ఇలాంటి ప్లాన్ చేసాడని లక్ష్మీ, పైడిరాజు కలిసి రుద్రతో అంటారు. మరొకవైపు రుద్ర వాళ్ళు ఇంటికి వస్తారు. ఏమైంది ఎందుకు జయకి వచ్చిన సంబంధం క్యాన్సిల్ అయిందని  పెద్దసారు అడుగుతాడు.

పెద్దఫ్యామిలీ లేదని రిజెక్ట్ చేశారంట అని వీరు అంటాడు. ఇప్పటికైనా ఆ విశ్వనాథ్ పొగరు తగ్గిందా అని శకుంతల అడుగుతుంది. ఈ రెండు కుటుంబాలు కలిసి పెళ్లి జరిపించేలా చేస్తానని విశ్వనాథ్ గారికి మాటిచ్చానని వీరు అంటాడు. ఎవరిని అడిగి మాటిచ్చావని శకుంతల కోప్పడుతుంది. ప్రీతీ, శ్రీమంతం సుధా పిన్ని దగ్గరుండి జరిపించింది. ఇప్పుడు జయ పెళ్లి జరిపి ఆ ఋణం తీర్చుకోవాలనుకుంటున్నానని వీరు అంటాడు. అవును పెద్దమ్మ ఇప్పుడు నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే పై చెయ్  మీదే ఉంటుంది కదా పెద్దమ్మ అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com