.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -19 లో.....గీతాంజలి డల్ గా ఉంటుంది. అప్పుడే భానుచందర్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఆ అంజలి వల్ల పర్మిషన్ క్యాన్సిల్ అయిందని చెప్తుంది. ఎప్పుడు అదేనా ఇంట్లో పిల్లలని పట్టించుకోవడం లేదు.. ముఖ్యంగా నన్ను అని భానుచందర్ కోప్పడతాడు. సారీ అని గీతాంజలి చెప్తుంది.
మరొకవైపు అంజలి ప్రొద్దున లేచి ముగ్గు వేస్తుంది. అదంతా రాజారావు రత్నం చూసి మురిసిపోతారు. రత్నం తన మనవరాలికి చూపించి చూడు ఆ అమ్మాయి ప్రొద్దున లేచి ఎంత పద్ధతిగా పనులన్నీ చేసి ముగ్గు వేస్తుందోనని అంజలిని మెచ్చుకుంటుంటే తను కోపంగా లోపలికి వెళ్తుంది. మరొకవైపు అంజలి ముగ్గు వేస్తుంటే రాకీ తనని చూస్తూ ఫొటోస్ తీసుకుంటాడు. ఎంత అందగా ఉందని అనుకుంటాడు. మరొకవైపు గీతంజలి, భానుచంధర్, మనీష్ జాగింగ్ కి వెళ్తారు.
ఆ అంజలి ఎక్కడున్నా నా ముందుకి తీసుకొని రావాలని చెప్పాను.. ఇప్పటికే ఒక రోజు అవుతుంది. ఇంకా మూడు రోజులు టైమ్ ఉందని మనిష్ తో గీతాంజలి అంటుంది. ఆ తర్వాత మనిష్ ఇంటికి వస్తాడు. ముగ్గుపై కాలు వెయ్యబోతుంటే అంజలి ఆపుతుంది. నువ్వు ముగ్గుపై అడుగుపెట్టకుండా లోపలికిరా అని మనీష్ తో అంజలి అంటుంది. తరువాయి భాగంలో అంజలి గుడికి వెళ్తుంది. అక్కడికి గీతాంజలి వస్తుంది. అంజలిని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
