జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -433 లో.. జయ కోసం వంశీ తన గదిలోకి వస్తాడు. అప్పుడే విశ్వ దగ్గరికి గంగ, రుద్ర వస్తారు. జయ గదిలోకి సుధ రావడం చూసి వంశీ దాక్కుంటాడు. గంగ వాళ్లు వచ్చారు కిందకి రా జయ అని సుధ అంటుంది. ఇప్పుడు ఎందుకు రోజూ కలుస్తూనే ఉన్నాం కదా అని జయ అంటుంది. అయితే ఏంటి పదా కిందకి అని జయని సుధ తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత రుద్రని చూసి జయ టెన్షన్ పడుతుంది. ఏంటి జయ టెన్షన్ పడుతున్నావని రుద్ర అడుగుతాడు. ఏం లేదు తలనొప్పిగా ఉంది నేను నా రూమ్ కి వెళ్తానని జయ అంటుంది.
గంగ నువ్వు వెళ్లి రూమ్ లో టాబ్లెట్ తీసుకొని రా అని రుద్ర అంటాడు. వద్దు తనకి ఏం తెలుసని జయ అంటుంది. నాకు తెలుసు కదా నేను తీసుకొని వస్తానని సుధ అనగానే జయ టెన్షన్ పడుతుంది. ఎందుకంటే నిజం బయటపడుతుందని రుద్ర అంటాడు. ఏం నిజమని విశ్వ అడుగుతాడు. వంశీని పిలుస్తావా నేను పిలవాలా అని రుద్ర అంటాడు. వంశీ అని గట్టిగా పిలుస్తాడు. వంశీ కిందకి వస్తాడు. వంశీని చూసి విశ్వ షాక్ అవుతాడు. రాస్కెల్ ఎంత ధైర్యం ఉంటే నా కూతురు గదిలోకి వెళ్తావ్.. ఇదేనా మీ పెద్దనాన్న మిమ్మల్ని పెంచిన సంస్కారం అని కోప్పడతాడు. దాంతో విశ్వని రుద్ర సముదాయిస్తాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలిస్తే బాధపడతారు. వంశీ గది వరకు వచ్చాడంటే జయ ఎంత చనువు ఇచ్చిందోనని అంటారని రుద్ర అంటాడు.
ఆ తర్వాత రుద్ర వచ్చేసరికి గంగ బయట మంచం వేసి రెడీగా ఉంటుంది. రంగా అరటి తొక్క వేస్తాడు. దాంతో గంగపై రుద్ర పడతాడు. ఆ తర్వాత వీరు ఎలాగైనా ఆస్తి పేపర్స్ కొట్టేయాలని ఇషికతో కలిసి ప్లాన్ చేస్తాడు. రాత్రి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తుంటే ఏదో శబ్దం చేస్తాడు. దాంతో అందరు లేస్తారు.. దొంగ అంటూ వీరుని కొడతారు.. గంగ కొడుతుంది. రుద్ర వచ్చి వీరుకి ఉన్న మాస్క్ తీయాలని అనుకుంటాడు కానీ ఇషిక లైట్ ఆఫ్ చేస్తుంది.. వీరు పారిపోతాడు. తరువాయి భాగంలో గంగతో పోటీలో గెలిస్తేనే వంశీతో నీ పెళ్లి అని జయతో విశ్వ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Jayam Serial Episode 433, Zee Telugu Jayam Serial Today]




