స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' (Godavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -170....లో జాను నల్లపూసల వేడుకకు పుస్తెలు కొనమని శారద వాళ్లు నందుకి చెప్తారు. సంజయ్ నల్లపూసల వేడుక గురించి ఆలోచిస్తూ ఉండగా జాను బామ్మ, తాతయ్యలను తీసుకొచ్చి మీ మనవడు తెగ ఆలోచించేస్తున్నాడని ఇన్‌డైరెక్ట్ గా మాట్లాడుతుంది. నల్లపూసల కార్యక్రమం వద్దు అనుకుంటున్నావా అని తాతయ్య అడిగితే లేదు తాతయ్య మీ ఇష్టమే నా ఇష్టమని సంజయ్ అంటాడు. మీరు పెళ్లి బట్టల్లోనే నల్లపూసల వేడుక చేసుకోవాలి.. మీ పెళ్లి మేం చూడలేదు కాబట్టి దీన్ని పెళ్లిలా భావిస్తామని బామ్మ అంటుంది..మిమ్మల్ని మేం మోసం చేస్తున్నాం క్షమించండి అని జాను మనసులో అనుకుంటుంది.
పుస్తెలు కొనడం నా వల్ల కాదని నందు అంటాడు. శారద, బామ్మ ఇద్దరూ నందుతో జాను నల్లపూసల కార్యక్రమం చేస్తున్నారు.. పుట్టింటి నుంచి మనం ఒక పుస్తె వేయాలని చెప్తారు. దానికి నందు వాళ్ల వైభవం చూపించుకోవడానికి ఫంక్షన్ చేస్తున్నారు.. పుస్తె కొనాలి చాలా ఖర్చు అవుతుంది.. బంగారం రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా వేలు కాదు లక్షలు నా వల్ల కాదని కోపంగా అంటుంది. మరోవైపు జాను అందంగా రెడీ అవుతూ ఉంటే సంజయ్ చూసి పాట వేసుకొని చూస్తూ ఉండిపోతాడు. నా అందానికి పడిపోయావ్ కదా అని జాను అడిగితే అంతలేదమ్మా అయినా నువ్వేంటి ఇంతలా రెడీ అయ్యావని సంజు అడుగుతాడు. ఇంట్లో వాళ్ల కోరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. ఈరోజు పెళ్లి రేపు నల్లపూసల వేడుక ఎల్లుండి సీమంతం తర్వాత బారసాల అని జాను అంటుంది.
ఫంక్షన్ కి వెళ్దామని కిన్నెర అంటే పుస్తెలు కొనలేదు కదా వెళ్లడానికి కుదరదని శారద అంటుంది.కిన్నెర మాత్రం ఒప్పుకోదు.. బామ్మ మనం అయినా వెళ్దామని లాగేస్తుంది. దాంతో బామ్మ నా వల్ల కాదు నాకు తలనొప్పి అని బామ్ తెచ్చుకోవడానికి వెళ్తుంది.. అప్పుడే అక్కడ నందు పుస్తెలు కనిపిస్తాయి. పుస్తెలు రెండు బాక్స్ లలో ఉండటం చూసి నందు జాను కోసం పుస్తెలు కొన్నదని బామ్మ అనుకొని శారద, గౌతమి, మురళీ వాళ్లకి చెప్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. ఒక్క పుస్తె చాలు కదా మరి రెండు ఎందుకు కొనింది అని రెండో సూత్రం మురళీకి ఇచ్చి దాచమని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godavari Serial Today November 21st, Godavari Serial Today Episode, Star Maa TV Godavari]




