Home

»

Tv News

Godavari: శంకర్‌ను నమ్మించి గొంతు కోస్తున్న సింహాద్రి.. జానుకు దొరికిపోయిన గౌతమి-జస్వంత్!

Jun 4, 2026 3:18PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-21 లో.. సింహాద్రిని కలిసి శంకర్ మాట్లాడతాడు. ఒరేయ్ వాళ్ళు తోట డాక్యుమెంట్లు ఇస్తేనే పెళ్ళిమండపానికి వస్తారని చెప్పారు.‌ నాకు టెన్షన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేపించావా? డాక్యుమెంట్లు తెచ్చావా అని సింహాద్రిని శంకర్ అడుగుతాడు. లేదురా అని సింహాద్రి అనగానే అదేంట్రా అని శంకర్ అడుగుతాడు. వాడు కోమాలోకి వెళ్ళాడురా అందుకే రిజిస్ట్రేషన్ చేపించలేదని సింహాద్రి అనగానే మొన్ననే కదరా డబ్బులు తీసుకున్నాడు.. అప్పుడే కోమా ఏంట్రా అని శంకర్ అనగానే వాడు అనుకోని విధంగా కోమాలోకి వెళ్ళాడు.. డబ్బులు మొత్తం ఇచ్చేశా.. సంతకం చేసిన కాగితం కూడా లేదురా.. ఇంకో విషయం ఏంటంటే నేను వాడికి డబ్బు ఇచ్చినట్టు వాడికి ఒక్కడికే తెలుసురా అని సింహాద్రి అనగానే శంకర్ షాక్ అవుతాడు. మరి ఇప్పుడు ఎలారా అని శంకర్ అనగానే నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటా.. అవసరమైతే నా ఆస్తులు మొత్తం అమ్మి అయినా సరే నీ కూతురి పెళ్ళి చేస్తానని సింహాద్రి అంటాడు. 

అదే సమయంలో జాను అక్కడికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకలా టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. అదేం లేదమ్మా.. వేరే విషయం మాట్లాడుకుంటున్నామని సింహాద్రి కవర్ చేస్తాడు. ఇక జాను వెళ్ళగానే ఎందుకు అబద్ధం చెప్పావ్ రా అని సింహాద్రిని శంకర్  అడుగగా తనకి తెలిస్తే టెన్షన్ పడుతుందిరా అని సింహాద్రి కవర్ చేస్తాడు. మరోవైపు మురళి పెళ్ళి పనుల్లో బిజీగా ఉంటూ .. తన ఫ్రెండ్ తో నందు గురించి చెప్తూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే సూర్య వస్తాడు. అదే సమయంలో ఒక ఆవిడ వచ్చి నాకు కిటికీల జాకెట్ కావాలంటే మీ వాడు ఇలా కుట్టాడంటూ తిడుతుంది. ఇక సూర్య తన తెలివితేటలు ఉపయోగించి కవర్ చేస్తాడు. మరోవైపు గౌతమి, జస్వంత్ ఒక గదిలో మాట్లాడుకుంటారు.

గౌతమి నువ్వు కాలేజీకి రావడం లేదు.. నాకు  చేయాలో తోచడం లేదు.. నువ్వు నాకు కావాలి అంటూ జస్వంత్ తన ఆవేదన చెప్తాడు. మరో రెండు రోజుల్లో మా అక్క పెళ్ళి అవుతుంది. నేను కాలేజీకి వస్తాను అక్కడ చూసుకుందామని గౌతమి అనగానే అవన్నీ వద్దు.‌ నాకు ఒక ముద్దు కావాలంటూ తనని దగ్గరకి తీసుకోగా అప్పుడే జాను వస్తుంది. దాంతో గౌతమి అతడిని దూరంగా తోసేస్తుంది. ఏంటి జస్వంత్ ఇక్కడున్నావని జాను అడుగుతుంది. సబ్జెక్టు లో డౌట్ ఉంటే అడగడానికి వచ్చాడని గౌతమి కవర్ చేస్తుంది. అయితే జానుకి డౌట్ వస్తుంది. వాళ్ళ మీద ఓ కన్ను వేసి ఉంచాలని అనుకుంటుంది. మరోవైపు తోటకి వెళ్తాడు శంకర్. అక్కడ పనిచేసే అతను వచ్చి కొబ్బరి బొండం తీసుకురావాలా అని అడుగుతాడు. వద్దని శంకర్ అంటాడు. సింహాద్రి తోట అమ్మిన అతడితో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయొంచాలని చూస్తున్నాడని శంకర్ అనగానే పాపం అయ్యగారిని  ఆ సింహాద్రి మోసం చేస్తున్నాడని అనుకుంటాడు. మరోవైపు సింహాద్రి తన ఇంట్లో బీరువాలో ఉన్న శంకర్ తోటకి సంబంధించిన డాక్యుమెంట్లు చూసి కన్నింగ్ గా ఆలోచిస్తుంటాడు. నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారా శంకర్ అని సింహాద్రి అనుకుంటాడు. అదే సమయంలో సింహాద్రి భార్య కాఫీ తీసుకొని వస్తుంది. అవి శంకర్ అన్నయ్య తోటకి సంబంధించిన డాక్యుమెంట్లా అని ఆవిడ అడుగగా నీకు సంబంధం లేదని తిట్టి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com