Jayam serial: వీరూనే అదంతా చేశాడని తెలుసుకున్న గంగ.. ఏం చేయనుంది?
on Jan 1, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -156 లో... శేఖర్ నిజం చెప్పాలని గంగ యాక్టింగ్ చేస్తుంది. దాంతో శేఖర్ నిజం చెప్తాడు. అదంతా రుద్ర వింటాడు. అసలు నీతో ఇదంతా ఎవరు చేస్తున్నారన్నా అని గంగ అనగానే శేఖర్ పారిపోతాడు. శేఖర్ కి ఎదురుగా రుద్ర వచ్చి ఆపుతాడు. గంగ, శ్రీనన్న వస్తారు. గంగ చెంప రుద్ర చెల్లుమనిపిస్తాడు. అసలు నువ్వు ఇలా ఎందుకు యాక్టింగ్ చేసావ్.. ఇంకా ఇంట్లో నుండి లెటర్ రాసి పెట్టి వచ్చావ్.. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని గంగపై రుద్ర కోప్పడతాడు.
ఆ తర్వాత శేఖర్ ని రుద్ర బెదిరించగా జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో నిన్ను కాంటాక్ట్ అయిన నెంబర్ ఇవ్వమని రుద్ర అనగానే అతను నెంబర్ ఇస్తాడు. రుద్ర అతనికి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచాఫ్ వస్తుంది. అత్తయ్య ముందు శేఖరన్నా నువ్వు నిజం చెప్పాలని తనని ఇంటికి తీసుకొని వెళ్తారు... గంగని చూసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ చెంపపై వేలిముద్ర చూసి ఎవరు కొట్టారని పెద్దసారు అడుగుతాడు. నేనే కొట్టాను నిజం చెప్పించడానికి చనిపోయినట్లు యాక్టింగ్ చేసింది అందుకే కొట్టానని రుద్ర చెప్తాడు. శేఖర్ రాగానే వీరు టెన్షన్ పడతాడు. శేఖర్ ఇంట్లో వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన అతను కూడా వీరు సర్ లాగే పొడవు ఉంటారని శేఖర్ చెప్తాడు.
ఆ తర్వాత గంగ చెంపపై ఉన్న నొప్పికి ఇబ్బంది పడుతుంటే రుద్ర వచ్చి కూల్ బ్యాగ్ ఇచ్చి పెట్టుకోమ్మంటాడు. అనుకోకుండా రుద్ర వెళ్లిపోతుంటే గంగపై పడుతాడు. గంగ రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది. సారీ గంగ నిన్ను కొట్టినందుకు అని చెప్పి వెళ్లిపోతుంటే గంగ సిగ్గుపడుతుంది. మరొకవైపు ఆ శేఖర్ గాడు లాస్ట్ మినిట్ లో ఇలా చేసాడని ఇషిక, వీరు డిజప్పాయింట్ అవుతారు.
ఆ తర్వాత వీరు దగ్గరికి గంగ వచ్చి ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు అన్నయ్య అని గంగ అనగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



