జైఆకాష్ ఇంట్లో విషాదం...మిస్ యూ అప్పా అంటూ పోస్ట్
on Feb 2, 2023
ఒకప్పుడు మూవీస్ లో వరుస అవకాశాలు దక్కించుకుని ఒక మోస్తరు హీరోగా నిలబడ్డాడు జై ఆకాష్. అలా కొంత కాలం మంచిగా అవకాశాలు దక్కించుకుని సెటిల్ అయ్యాడు కానీ ఆ తరువాత మూవీస్ ఎంపిక విషయంలో అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన నిన్నటి తరం హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఫ్యామిలీ హీరోగా ఆకాష్ కి అప్పట్లో ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉండేది. ఆయన చేసింది తక్కువ సినిమాలే ఐనా స్మార్ట్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు.
"ఆనందం" మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో ఐపోయాడు. తర్వాత కొన్ని మూవీస్ లో నటించాడు కానీ అవి పెద్దగా ఆడలేదు. దాంతో ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి ఆకాష్ ఇంట్లో ఇప్పుడు ఒక విషాదం చోటుచేసుకుంది. ఆ విషయాన్ని ఆకాష్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నారు. " నా ప్రియమైన నాన్న ఈరోజు ఉదయం లండన్‌లో కన్నుమూశారు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అప్పా" అని కాప్షన్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫాన్స్ అలాగే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వారంతా కూడా "ఆయన ఆత్మకు శాంతి కలగాలి" అని కోరుకుంటూ మెసేజెస్ పెట్టారు.
ఇకపోతే ఆకాష్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. కానీ మూవీస్ లోకి వెళ్లకుండా సీరియల్స్ లో నటిస్తున్నారు. జెమినిలో త్వరలో స్టార్ట్ కాబోయే "గీతాంజలి" సీరియల్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో ఫేమస్ సీరియల్ నటి సుజిత ధనుష్ యాక్ట్ చేస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
